Khammam : ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవీ నవరాత్రుల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.

Khammam : ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

Khammam

Updated On : October 17, 2021 / 7:35 AM IST

Khammam :  ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవీ నవరాత్రుల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. అయ్యగారిపల్లి ఇసుకల వాగు వద్ద దుర్గా దేవి నిమజ్జనానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇదే సమయంలో పలువురికి గాయాలయ్యాయి.

చదవండి : Telangana Rains: మళ్ళీ కుండపోత.. నేడు కూడా భారీ వర్షాలు!

స్థానికుల ద్వారా సమాచారం అందికున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఏలగొండ స్వామి, ఉపేందర్, నాగరాజు, ఉమగా గుర్తించారు. మృతులంతా కమలాపురం గ్రామానికి చెందినవారని తెలిపారు.

చదవండి : Saheli Rudra : రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా‌.. 25 మిలియన్ల మంది చూశారు