Saheli Rudra : రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా‌.. 25 మిలియన్ల మంది చూశారు

ఒక్కోసారి మనం సరదాగా చేసే పనులే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. రాత్రికి రాత్రి మనల్ని సెలబ్రిటీని చేస్తాయి. ఊహించని రీతిలో పాపులారిటీని తెచ్చి పెడతాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల

Saheli Rudra : రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా‌.. 25 మిలియన్ల మంది చూశారు

Saheli Rudra

Saheli Rudra : ఒక్కోసారి మనం సరదాగా చేసే పనులే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. రాత్రికి రాత్రి మనల్ని సెలబ్రిటీని చేస్తాయి. ఊహించని రీతిలో పాపులారిటీని తెచ్చి పెడతాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవలి కాలంలో ఇలాంటివి తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్ లో ఓ యువతి సరదగా డ్యాన్స్ చేయగా, ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ వీడియోను ఏకంగా 25 మిలియన్ల మంది చూశారు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

‘సాత్‌ సముందర్‌ పార్‌’ అనే పాటకు ఆ అమ్మాయి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసింది. ఆమె పేరు సహేలీ రుద్ర. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ప్ల్యూయెన్సర్‌. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద అందరూ చూస్తుండగానే రీమిక్స్‌ పాటకు స్టెప్పులేసింది. రుద్ర అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుంటే పక్కన ఉన్న వారంతా అలా చూస్తూ ఉండిపోయారు. వావ్.. వాటే డ్యాన్స్ అంటూ పొడిగారు.

సాత్ సముందర్ పార్ పాట విశ్వాత్మ సినిమాలోనిది. దివంగత నటి దివ్య భారతి, సన్నీ డియోల్‌పై ఈ పాటని చిత్రీకరించారు. ఇక యువతి డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వీక్షించారు. 1.5 మిలియన్‌ లైక్‌లు, 18.8 వేల కామెంట్లు వచ్చాయి.

Kidney Stones : కిడ్నీల్లో రాళ్ళు ఎందుకొస్తాయంటే?

పబ్లిక్ ప్లేసుల్లో సహేలీ రుద్ర డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక పబ్లిక్ పేసుల్లో ఆమె ఇలా డ్యాన్స్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఇలాంటి స్టన్నింగ్ డ్యాన్స్ వీడియోలు చాలానే ఉన్నాయి.