Samantha: యశోద సినిమా ఓకే చేసేందుకు సమంతకు ఎంత సమయం పట్టిందో తెలుసా?
స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో యశోద మూవీకి సంబందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది.

Samantha Gave Green Signal To Yashoda Script In One Sitting
Samantha: స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను నిజజీవితంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను చిత్ర టీమ్ ఫుల్ స్వింగ్‌లో నిర్వహిస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Samantha : చాలా కలలతో సినీ పరిశ్రమకి వచ్చాను.. ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నాను..
యశోద సినిమా కథతో దర్శకులు హరి-హరీశ్‌లు తన వద్దకు వచ్చినప్పుడు ఈ సినిమా స్క్రిప్టు విని తాను షాక్ అయ్యానని సమంత తెలిపింది. సాధారణంగా ఓ సినిమాను ఓకే చేసేందుకు తాను చాలా సమయం తీసుకుంటానని చెప్పిన సమంత, యశోద సినిమా కథను కేవలం ఒక్క సిట్టింగ్‌లోనే ఓకే చేసినట్లుగా తెలిపింది. దర్శకులు ఈ సినిమా కథను నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తీసుకున్నారని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని.. ఇలాంటి ఘటనలు గురించి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలని తాను ఈ సినిమా కథను వెంటనే ఓకే చేసినట్లుగా సమంత తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొంది.
Yashoda: సమంత సినిమాకు నిజంగానే అంత ఖర్చయ్యిందా..?
ఇక ఈ సినిమాను థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించగా, తాను నటించిన ‘యు టర్న్’ మూవీని పోలి ఉన్నట్లుగా కనిపిస్తుందని.. అయితే కేవలం జోనర్ వరకే ఈ రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని, కథ పరంగా మాత్రం పూర్తిగా వైవిధ్యమైన సినిమాలు అంటూ సమంత తెలిపింది. ఇక ఈ సినిమాలో సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, కల్పిక, దివ్య శ్రీపాద ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ‘యశోద’ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న రిలీజ్ కానుంది.