Sandal thief : చూస్తే బాగానే ఉన్నాడు.. చెప్పుల కోసం మరీ ఇలా.. వీడియో చూడండి..
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.

Sandal thief
Sandal thief video goes viral : చాలా ఇష్టపడి.. డబ్బులు ఇబ్బంది ఉన్నా సరే నచ్చిన చెప్పులు కొనుక్కుంటాం. ఏ గుడిలోనో పోగొట్టుకుంటాం. ఇక ఎంత బాధపడితే ఆ చెప్పులు తిరగి రావు. దొంగిలించిన వారు మాత్రం దర్పంగా అవి వేసుకుని వెళ్లిపోతారు. చూడటానికి బాగానే ఉన్న ఓ వ్యక్తి మరీ చీప్‌గా చేసిన చెప్పుల దొంగతనం చూస్తే నవ్వొస్తుంది.
ఇటీవల కాలంలో చెప్పుల దొంగతనాల గురించి పెద్దగా వినలేదు. కానీ ఇంకా అలాంటి దొంగతనాలు ఉన్నాయని నిరూపించాడు ఓ వ్యక్తి. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ ఓ షాప్ మెట్ల మీద కూర్చున్నాడు. అక్కడ వరుసగా వదిలి ఉన్న షూల నుంచి ఓ జతను సింపుల్‌గా కొట్టేశాడు. చేత్తో పట్టుకెళ్లాడు అనుకునేరు. తన కాళ్లకి ఉన్న చెప్పులు విడిచిపెట్టి కొట్టేసిన చెప్పులు వేసుకుని హ్యాపీగా వెళ్లిపోయాడు. చూసేవారికి తను విడిచిపెట్టిన చెప్పులు ధరిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన ఆ వ్యక్తి పాపం పైన సీసీ కెమెరా సంగతి మర్చిపోయినట్లున్నాడు.
altu.faltu అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పులకి కూడా రక్షణ లేదు అనే శీర్షికతో పోస్టైన ఈ వీడియోని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ చెప్పుల దొంగ పట్టుబడ్డాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాడు.
View this post on Instagram