Pavala Shyamala: 300కు పైగా సినిమాలు.. ఓల్డేజ్ హోంలో దీనస్థితిలో బతుకీడుస్తున్న పావలా శ్యామల!

తెలుగులో ఏకంగా 300 సినిమాలకు పైగా పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన పావలా శ్యామల, తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచాయి. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె జీవితాన్ని గడపడం చాలా కష్టంగా మారిపోయిందని వాపోతోంది.

Pavala Shyamala: 300కు పైగా సినిమాలు.. ఓల్డేజ్ హోంలో దీనస్థితిలో బతుకీడుస్తున్న పావలా శ్యామల!

Senior Character Actress Pavala Shyamala Leading Hard Life In Old-Age Home

Updated On : November 3, 2022 / 4:20 PM IST

Pavala Shyamala: సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కోట్లు ఉన్న వారు కూడా రోడ్డునపడ్డ సందర్భాలు కోకొల్లలు. అయితే సినిమా రంగంలోనూ ఇలాంటి పరిస్థితులు మనం చాలా చూశాం. రంగుల లోకంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న మేటి తారలు కూడా ఎవరూ లేని అనాధలుగా మారి కనుమరుగయ్యారు. అయితే కొందరు మాత్రం ఎంత కష్టపడినా, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడంతో తమ జీవితాన్ని దీనంగా గడుపుతున్నారు. అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కూడా ఒకరు.

Pavala Syamala : చిరంజీవి గారు అప్పట్లో 2 ల‌క్ష‌లిచ్చారు.. ఇప్పుడు మళ్లీ లక్ష ఇచ్చి ఆదుకున్నారు – పావ‌లా శ్యామ‌ల‌..

తెలుగులో ఏకంగా 300 సినిమాలకు పైగా పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన పావలా శ్యామల, తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచాయి. అయితే ఆమెను ప్రస్తుతం వృద్ధాప్య సమస్య ఇబ్బంది పెడుతోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె జీవితాన్ని గడపడం చాలా కష్టంగా మారిపోయిందని వాపోతోంది. తన ఆరోగ్యం బాగోలేకపోవడం.. తన కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వారు తీవ్ర కష్టాల్లో ఉన్నట్లుగా ఆమే పేర్కొంది. ఇక తనకు గతంలో ‘మా’లో మెంబర్‌షిప్‌ను లక్ష రూపాయలు వెచ్చించి మెగాస్టార్ చిరంజీవి ఇప్పించారని.. అలాగే తన కూతురి ఆరోగ్యం గురించి తెలుసుకుని మరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశారని ఆమె తెలిపింది.

Jeevan Kumar : సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల, టీఎన్‌ఆర్ కుటుంబాల‌కు న‌టుడు జీవ‌న్ కుమార్ సాయం..

కానీ, ప్రస్తుతం వారు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండటం, తన ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఓల్డేజ్ హోంలో కాలం వెల్లదీస్తున్నట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన కూతురిని చూసుకునేందుకు పని మనిషిని పెట్టుకునే స్థోమత కూడా తనకు లేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. తన కష్టాలను గుర్తించి తనకు సాయం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారని ఆశగా చూస్తోంది పావలా శ్యామల. మరి ఆమె దీనస్థితికి ఎవరైనా స్పందిస్తారా అనేది చూడాలి.