Sharath Kamal Wins Gold : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్.. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. చివరి రోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అదరహో అనిపించారు. భారత్ కు పసిడి పతకాల పంట పండించారు. తాజాగా భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది.

Sharath Kamal Wins Gold : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్.. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు స్వర్ణం

Updated On : August 8, 2022 / 9:41 PM IST

Sharath Kamal Wins Gold : బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. కామన్ వెల్త్ గేమ్స్ చివరి రోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అదరహో అనిపించారు. భారత్ కు పసిడి పతకాల పంట పండించారు. తాజాగా భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ లో ఆచంట శరత్ కమల్ విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో శరత్ కమల్ 11-13, 11-7, 11-2, 11-6, 11-7తో ఇంగ్లండ్ కు చెందిన లియామ్ పిచ్ ఫోర్డ్ ను ఓడించాడు. ఇదే ఈవెంట్లో భారత్ కు చెందిన జ్ఞానశేఖరన్ కు కాంస్యం లభించింది.

 

శరత్ కమల్‌కు గోల్డ్:

అటు, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లోనూ స్వర్ణం భారత్ నే వరించింది. భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి భారత్ ఖాతాలో మరో పసిడిని చేర్చారు. ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-15, 21-1తో ఇంగ్లండ్ కు చెందిన బెన్ లేన్, షాన్ వెండీ జోడీని చిత్తు చేసింది. తద్వారా బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ కు మూడో స్వర్ణాన్ని అందించింది.

శరత్ కమల్ పై ప్రధాని ప్రశంసలు

ఇప్పటికే మహిళల సింగిల్స్ లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ పసిడి పతకాలు సాధించడం తెలిసిందే. బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ ఖాతాలోని స్వర్ణాల సంఖ్య 22కి పెరిగింది.