Himanta Biswa Sarma: సావర్కర్ అందించిన సహకారాన్ని ప్రశ్నిస్తే పాపం తగులుతుంది: అసోం సీఎం హిమంత
దేశానికి సావర్కర్ అందించిన సేవలను ప్రశ్నిస్తే పాపం తగులుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. రాహుల్ గాంధీ అటువంటి పాపం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రశ్నించే హక్కు దేశానికి ఎటువంటి సహకారం అందించని వారికి లేదని అన్నారు.

he does not courage to play says biswa sarma on rahul gandhi
Himanta Biswa Sarma: దేశానికి సావర్కర్ అందించిన సేవలను ప్రశ్నిస్తే పాపం తగులుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. రాహుల్ గాంధీ అటువంటి పాపం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రశ్నించే హక్కు దేశానికి ఎటువంటి సహకారం అందించని వారికి లేదని అన్నారు.
భారత్ జోడో యాత్రలో సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై హిమంత బిశ్వశర్మ స్పందించారు. సావర్కర్ చాలా ఏళ్లపాటు జైలు జీవితం గడిపారని, ఆయన దేశానికి ఏం చేశారని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారని హిమంత బిశ్వశర్మ అన్నారు. మరోవైపు, మొఘలులు దేశం మొత్తాన్ని పాలించారనేలా చరిత్రను వామపక్ష పార్టీలు చిత్రీకరించే ప్రయత్నాలు చేశాయని చెప్పారు.
ఈశాన్య భారతం, అసోం, దక్షిణ భారతాన్ని మొఘలులు జయించలేకపోయారని అన్నారు. చరిత్రను వామపక్ష పార్టీల నేతలు నాశనం చేశారని, దాన్ని మళ్ళీ రాయాలని అన్నారు. కాగా, బ్రిటిష్ వాళ్లకు నమ్మకమైన సేవకుడిగా ఉంటానని సావర్కర్ ఓ లేఖ రాశారంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే, బ్రిటిష్ వారికి ఏ లేఖ రాసిన అప్పటి ఆచారం ప్రకారం ఆ విధంగా పేర్కొనేవారని పలువురు చెబుతున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..