Six-year-old boy dies: జ్వరంతో క్లినిక్‌కు వెళ్లి ఇంజక్షన్ చేయించుకున్న బాలుడి మృతి

జ్వరంతో ఇంటి దగ్గరలోని ఓ క్లినిక్ కు వెళ్లిన ఓ బాలుడికి అక్కడి నకిలీ వైద్యుడు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో చివరకు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ పిల్లాడిని క్లినిక్ కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచినా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ లో చోటుచేసుకుంది.

Six-year-old boy dies: జ్వరంతో క్లినిక్‌కు వెళ్లి ఇంజక్షన్ చేయించుకున్న బాలుడి మృతి

Updated On : November 8, 2022 / 3:04 PM IST

Six-year-old boy dies: జ్వరంతో ఇంటి దగ్గరలోని ఓ క్లినిక్ కు వెళ్లిన ఓ బాలుడికి అక్కడి నకిలీ వైద్యుడు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో చివరకు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ పిల్లాడిని క్లినిక్ కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచినా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ లో చోటుచేసుకుంది. దేవనాథన్ అనే బాలుడికి జ్వరం రావడంతో అతడి తండ్రి మహేశ్వరన్ ఇంటికి దగ్గరలోని ఓ క్లినిక్ కు తీసుకెళ్లాడు.

అక్కడ వైద్యురాలిగా చెప్పుకుంటున్న ఓ మహిళ మిడిమిడి జ్ఞానంతో ఇంజక్షన్ ఇచ్చి పంపింది. ఆ బాలుడు, అతడి తండ్రి తిరిగి ఇంటికి వచ్చారు. ఆ వెంటనే బాలుడి కాళ్లలో వాపులు కనపడ్డాయి. విపరీతమైన నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆ బాలుడిని అతడి తండ్రి మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు బాలుడికి మరో ఇంజక్షన్ ఇచ్చి పంపాడు. ఇంటికి వచ్చిన బాలుడిలో సమస్య మరింత పెరిగింది. మూర్చవచ్చిపడిపోయాడు.

దీంతో అతడిని రాజపాలయం ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ బాలుడికి మొదట ఇంజక్షన్ ఇచ్చిన క్లినిక్ కు వెళ్లి తనిఖీలు చేశారు. ఆ క్లినిక్ లో వైద్యురాలినని చెప్పుకుంటున్న మహిళ నకిలీ వైద్యురాలని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆ క్లినిక్ నుంచి పలు రకాల ఔషధాలు, ఇంజక్షన్లను స్వాధీనం చేసుకన్నారు. ఆ మహిళ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే బాలుడికి సెప్టిక్ అయి ప్రాణాలు కోల్పోయినట్లు విచారణలో తేలింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..