Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..

ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు..

Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..

Sonu Sood

Updated On : April 18, 2021 / 11:38 AM IST

Sonu Sood: సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

ఇదొక్కటే కాదు, ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి మాటలు చాలవు.. ఆపద ఉన్న చోటల్లా తాను అవసరమై ఆదుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ లో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ లొకేషన్‌కి సోను సైకిల్ మీద వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్!..

ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు. మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నాను అంటూ భరోసానిచ్చారు సోనూ సూద్.. ఇటీవలే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సోనూ సూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.