Sunny Leone: మంచు వారితో సన్ని లియోన్.. ఎక్కడికి వెళ్లిందంటే?

ఇటీవల మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్‌కు గురైందో మనకు తెలిసిందే. ‘మా’ ఎన్నికలు, ఆ తరువాత మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం.....

Sunny Leone: మంచు వారితో సన్ని లియోన్.. ఎక్కడికి వెళ్లిందంటే?

Sunny Leone Spotted In Tirupati University With Mohan Babu

Updated On : March 16, 2022 / 8:17 PM IST

Sunny Leone: ఇటీవల మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్‌కు గురైందో మనకు తెలిసిందే. ‘మా’ ఎన్నికలు, ఆ తరువాత మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఫెయిల్యూర్.. ఇలా సోషల్ మీడియాలోని మీమర్స్‌కు కావాల్సినంత స్టఫ్‌ను ఇచ్చారు మంచు హీరోలు. అయితే ఇప్పుడు మరోసారి మంచు మోహన్ బాబు వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ట్రోలింగ్‌లో కాదులెండీ.. ప్రముఖ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్‌ను మంచు మోహన్ బాబు తిరుపతిలోని తన యూనివర్సిటీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Sunny Leone: మంచు హీరోలతో సన్నీ.. అప్పుడు మనోజ్, ఇప్పుడు విష్ణు!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందిస్తుండగా, ఇందులో హాట్ బ్యూటీలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలోనూ సన్నీ లియోన్ నటించింది. ఆ సినిమాతో మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు విష్ణుతో చేస్తున్న సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక షూటింగ్ ముగించుకున్న సన్నీ లియోన్‌ను మోహన్ బాబు తనతో పాటు తిరుపతిలోని తన విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లాడు.

Sunny Leone : 2000 రూపాయల లోన్ కోసం సన్నీ లియోన్ పాన్ కార్డు వాడకం.. ట్విట్టర్లో సన్నీ కంప్లైంట్

అక్కడ కొంతమంది విద్యార్ధులకు సన్నీ లియోన్‌ను పరిచయం చేసేందుకు మోహన్ బాబు దగ్గరుండి ఆమెను తీసుకెళ్లాడు. అయితే అంతమంది విద్యార్ధులను చూసి సన్నీ తడబడుతుంటే, మోహన్ బాబు ఆమె చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకెళ్లారు. విద్యార్ధుల కేరింతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వారందరికీ సన్నీ హాయ్ చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను సన్నీ లియోన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ, మోహన్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి ఈ సినిమాతో విష్ణు హిట్ కొడతాడా లేడా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)