Sushrut Mishra Story : నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నా ఐఫోన్, కారు ఎందుకు లేవో చెప్పిన యంగ్‌స్టర్

అతని వయసు 23.. మంచి ఉద్యోగం.. రూ.15 లక్షలు జీతం.. అయినా అతని దగ్గర ఐఫోన్, కారు కనీసం బైక్ కూడా లేదట.. కారణం ఏంటనేది అతనే ట్వీట్ చేసాడు.

Sushrut Mishra Story : నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నా ఐఫోన్, కారు ఎందుకు లేవో చెప్పిన యంగ్‌స్టర్

Sushrut Mishra Story

Updated On : June 11, 2023 / 3:41 PM IST

Sushrut Mishra Story : వీసీ మీడియా కో ఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా మంజి పొజిషన్‌లో ఉన్నారు.. అయినా తన దగ్గర ఐఫోన్, కారు లాంటి లగ్జరీ వస్తువులు ఎందుకు లేవో చెబుతూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

మంచి తెలివి తేటలు ఉన్న బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? డబ్బును ఎప్పుడు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తాడు. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని కుటుంబం, బాధ్యతల కోసంకూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెలకు 1.5 లక్షల జీతం అంటే ఫర్వాలేదు.. అంత మంచి జీతం వచ్చినా తల్లిదండ్రుల కోసం.. కుటుంబం కోసం.. భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఎలాంటి విలాసాలకు పోని సుశ్రుత్ మిశ్రా గురించి ఇప్పుడు చెప్పబోయేది.

 

వీసీ మీడియా సహ వ్యవస్థాపకుడిగా, కంటెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్న సుశ్రుత్ మిశ్రా రీసెంట్‌గా ఓ ట్వీట్ చేశారు. ‘ రూ.1.50 లక్షలు తన నెలవారీ జీతం అని .. వయసు 23 సంవత్సరాలు అని.. తన వద్ద ‘యాపిల్’ ప్రాడక్ట్స్ ఏవీ లేవని, కనీసం కారు, బైక్ కూడా లేవని రాసుకొచ్చారు. ఎందుకు అంటే.. భారతదేశంలో పుట్టిన కొడుకుగా పదవీ విరమణ చేసిన తల్లిదండ్రుల బాధ్యతలు.. ఇంట్లో చెల్లించాల్సిన బిల్లులు, తన కుటుంబ భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఉన్నాయని’ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపచేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Story of mother and son : తల్లి ఇష్టాన్ని నెరవేర్చిన కొడుకు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఆయుష్ గోయల్ కథ..

‘నాకు బాధ్యతలు ఉన్నాయి.. కానీ బైక్, యాపిల్ ప్రాడక్ట్స్ కొనుక్కోవడం కోసం మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్ధం కాలేదు’ అని ఒకరు..’నాకు కుటుంబ బాధ్యతలతో పాటు చాలా కోరికలు ఉన్నాయని’ మరొకరు వరుసగా రిప్లై చేశారు. సగటు భారతీయ కొడుకు బాధ్యతల లిస్టు బాగానే ఉన్నా.. చిన్న చిన్న కోరికలు వాయిదా వేసుకోవడం అవసరంలేదని కొందరు సలహా ఇచ్చారు.