Auto Accident : ఆటో బోల్తా..8మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..ముగ్గురి పరిస్థితి విషమం..

ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం ఉందని డాక్టర్లు తెలిపారు.

Auto Accident : ఆటో బోల్తా..8మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..ముగ్గురి పరిస్థితి విషమం..

Auto Accident In Telangana (1)

Updated On : November 22, 2021 / 4:43 PM IST

Auto Accident In Telangana :  చాలా కాలానికి స్కూళ్లు తీశారు. విద్యార్ధులు కూడా ఇంటిలో బోర్ కొట్టి కొత్త ఉత్సాహంతో స్కూళ్లకు వెళుతున్నారు. ఫ్రెండ్స్ తో హ్యీపీగా ఆడుకుంటున్నారు. సెలవులిస్తే బాగుండు అనుకునే విద్యార్ధలకు ఈకరోనా కాలంలో స్కూల్ ఎప్పుడు పెడతారా? అన్నట్లుగా ఎదురు చూశారు. కేసులు తగ్గటంతో తెలంగాణలో స్కూళ్లు తెరిచారు. ఉత్సాహంగా పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. విద్యార్ధులతో వెళుతున్న ఓ ఆటో బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లాలో కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 8మంది విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా..మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్ధుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.