Delhi : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్బంగా పది అంశాలతో కూడిన లేఖను ప్రధాని మోదీకి అందించారు కేసీఆర్.

Delhi
Delhi : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. భేటీలో కీలక అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్.. మొత్తం 10 అంశాలతో కూడిన ప్రతిపాదనల లేఖను కేసీఆర్ మోదీకి అందచేశారు. వీటిలో ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాలని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్‌లో ఐఐఎంతో పాటు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ మోదీని కోరారు.
కాగా టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే.. సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం టీఆర్ఎస్ కార్యాలయ భూమి భుజ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ మోదీతో భేటీ అయ్యారు.