Temple, Dargah Demolished : ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య దేవాలయం, దర్గా కూల్చివేత

Temple, Dargah Demolished
Temple, Dargah Demolished : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం ఉదయం దేవాలయం, దర్గాను అధికారులు కూల్చివేశారు. ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య భజన్ పురా చౌక్ లోని హనుమాన్ దేవాలయం, దర్గాను ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు కూల్చివేశారు.
Heavy Rainfall : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్… భారీవర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు, సీఆర్ పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. (northeast Delhi amid heavy security) సహరాన్‌పూర్ హైవే నిర్మాణం కోసం రహదారిని విస్తరించేందుకు ఆలయం, దర్గాను కూల్చివేశారు.
Delhi-Meerut rapid rail project : ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు
భజన్ పురా చౌక్ లో ఆలయం, దర్గాల కూల్చివేత శాంతియుతంగా జరిగిందని ఈశాన్య ఢిల్లీ డీసీపీ ఎన్ టిర్కీ చెప్పారు. జాతీయ రహదారి విస్తరణ కోసం రెండు నిర్మాణాలను తొలగించారు.