Delhi-Meerut rapid rail project : ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు...

Delhi-Meerut rapid rail project : ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

Delhi-Meerut rapid rail project

Delhi-Meerut rapid rail project : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు. (LG VK Saxena approves land allotment)

Rajya Sabha seat : బెంగాల్ రాజ్యసభ బీజేపీ సీటు రేసులో సౌరవ్ గంగూలీ, మిథున్‌

ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (డియుఎస్‌ఐబి)కి చెందిన ఈ భూమి కేటాయింపు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని, రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్) ప్రాజెక్ట్ అమలుకు ఇది కీలకమని రాజ్ నివాస్ అధికారులు తెలిపారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ కారిడార్‌లో సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.

Bhim Army chief : భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు సెక్యూరిటీ

ఈ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నిర్మించనుంది. పూర్వపు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ జల్ బోర్డు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే తమ భూమిని ఎన్సీఆర్టీసీకి బదిలీ చేశాయి.