PV Sindhu on Modi tweet: థ్యాంక్యూ సర్.. త్వరలో మిమ్మల్ని కలుస్తాను: పీవీ సింధు

''అసాధారణ ఆటతీరుకనబర్చే పీవీ సింధు ఛాంపియన్లకే ఛాంపియన్... ఎక్సలెన్స్ అంటే ఏంటో ఆమె తరుచూ చూపెడుతోంది. ఆమె నిబద్ధత, అకింతభావం స్ఫూర్తివంతం. . కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి'' అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ట్వీట్ పై పీవీ సింధు స్పందించింది.

PV Sindhu on Modi tweet: థ్యాంక్యూ సర్.. త్వరలో మిమ్మల్ని కలుస్తాను: పీవీ సింధు

PV Sindhu wins gold medal

Updated On : August 8, 2022 / 6:41 PM IST

PV Sindhu on Modi tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పీవీ సింధు ఇవాళ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై తొలి ఆటలో 21-15తో, రెండో ఆటలో 21-13తో గెలిచిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం. గతంలో ఆమె ఈ గేమ్స్ లో కాంస్యం, రజతం సాధించింది. దీంతో ఆమెపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.

”అసాధారణ ఆటతీరుకనబర్చే పీవీ సింధు ఛాంపియన్లకే ఛాంపియన్… ఎక్సలెన్స్ అంటే ఏంటో ఆమె తరుచూ చూపెడుతోంది. ఆమె నిబద్ధత, అకింతభావం స్ఫూర్తివంతం. . కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి” అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ట్వీట్ పై పీవీ సింధు స్పందించింది.

ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ”థ్యాంక్యూ సర్.. త్వరలోనే మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను. మాకు వెంటవెంటనే పలు టోర్నమెంట్లు ఉన్నాయి. త్వరలోనే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ రానుంది. ఇవాళ గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుకోసమే చాలా కాలంగా ఎదురుచూశాను. ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ వస్తాయి. కాంస్యం, రజతం, స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారిణిగా ఇప్పుడు నిలిచాను. క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. నా కోచ్ కు కృతజ్ఞతలు” అని చెప్పింది.

Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్