Viral Video: చెత్తఏరుకొనే వృద్ధురాలి ఇంగ్లీష్ వింటే షాక్!

టాలెంట్ ఉండాలి కానీ ఏదో ఒక రోజు.. ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని మన టాలెంట్ ప్రపంచానికి తెలియడం కూడా

Viral Video: చెత్తఏరుకొనే వృద్ధురాలి ఇంగ్లీష్ వింటే షాక్!

Viral Video

Updated On : August 20, 2021 / 7:46 AM IST

Viral Video: టాలెంట్ ఉండాలి కానీ ఏదో ఒక రోజు.. ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని మన టాలెంట్ ప్రపంచానికి తెలియడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. రోడ్ల మీద తిరుగుతూ దొరికింది తింటూ.. రోడ్డు పక్కన నిద్రపోయే చాలా మందికి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే, వాళ్ళలో ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో ఎవరికి తెలియదు. వారిలో ఏ టాలెంట్ ఉందో కూడా మనకి అర్ధం కాదు.

 

View this post on Instagram

 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)


అప్పుడప్పుడు ఇలా రోడ్ సైడ్ పిచ్చి వాళ్ళలా కనిపించే వారు ఒక్కసారిగా వారిలో టాలెంట్ బయటకి రాగానే సోషల్ మీడియా సెలబ్రిటీలైపోతుంటారు. ఇలాంటి వారిని మనం ఇప్పటికే చాలా మందిని చూడగా.. ఇప్పుడు సిసిలియా మార్గరెట్ అనే వృద్ధురాలి వీడియో కూడా అలానే వైరల్ అవుతుంది. సిసిలియా బెంగళూరు నగరంలో ఓ స్ట్రీట్ లో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా ఓ మహిళా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)


అంత వయసులో.. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ ఓ రేంజ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటోంది. బెంగళూరులో ఉండే ఈ మహిళ ఒక‌ప్పుడు బాగానే బ‌తికింది. కానీ ఏం జరిగిందో తెలియ‌దు. కానీ ప్ర‌స్తుతం ఆమె చిత్తు కాగితాలు ఏరుకుంటూ.. బిచ్చమెత్తుకుంటూ బతుకుతోంది. మ‌తి స్థిమితం కూడా లేనట్టుంది. కానీ.. తనకు వచ్చిన ఇంగ్లీష్ ను మాత్రం ఆమె మరిచిపోలేదు. ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడుతుంది. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.