Parineeti Chopra: ఒక్క సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయని హీరోయిన్!
నటీనటులలో కొందరు మేకప్, డూప్స్ తో మ్యానేజ్ చేసేవాళ్ళు ఉంటే.. క్యారెక్టర్ కోసం మరికొందరు సహజంగా కనిపించేందుకు తనను తాను మార్చుకొనే వాళ్ళు కూడా ఉంటారు. లావుగా కనిపించాలని రిస్క్ చేసి మరీ బరువు పెరిగిన వాళ్ళతో పాటు నల్లగా కనిపించాలని రోజుల తరబడి ఎండలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు

The Heroine Who Has Not Bathed For Two Days For A Single Scene
Parineeti Chopra: నటీనటులలో కొందరు మేకప్, డూప్స్ తో మ్యానేజ్ చేసేవాళ్ళు ఉంటే.. క్యారెక్టర్ కోసం మరికొందరు సహజంగా కనిపించేందుకు తనను తాను మార్చుకొనే వాళ్ళు కూడా ఉంటారు. లావుగా కనిపించాలని రిస్క్ చేసి మరీ బరువు పెరిగిన వాళ్ళతో పాటు నల్లగా కనిపించాలని రోజుల తరబడి ఎండలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కూడా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిందట.
పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. ఈ సినిమాలో అనుకోని ఘటనలో ఆమె పాత్రకి గర్భ విచ్ఛిత్తి జరగడం, కొన్ని రోజుల పాటు అదే షాక్‌లో ఉండిపోవాల్సి ఉంది. ఈ సీన్లను సహజంగా తెరకెక్కించగా ఇందుకోసమే పరిణీతి మురికిగా ఉన్న ప్రదేశంలో పడుకుని రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలాగే మరుసటి రోజు సెట్‌కు వచ్చేసి ఆ సీన్స్ లో నటించిందట.
ఈ సీన్స్ ఓ కొండ ప్రాంతంలోని ఓ గుడిసెలో మూడు రోజుల పాటు షూటింగ్ జరగగా.. ఆ ప్రాంతం మొత్తం మురికిగా ఉందట. అక్కడే తొలిరోజు షూటింగ్ లో బాడీ మొత్తం బురదకాగా ఇంటికి వెళ్లిన పరిణీతి స్నానం చేయకుండా మరుసటి రోజు అలానే షూటింగ్‌లో పాల్గొనేదట. సహజంగా, మేకప్ సాయం లేకుండా ఆ సీన్ ఉండేలా చేయాలనే అలా ఉన్నానని పరిణీతి చెప్పింది. పరిణీతి పాత్రను చూస్తే నిజమేనేమో అనేలా సహజంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పరిణీతి నటన కూడా విశ్లేషకుల ప్రశంసలు దక్కించుకుంది. ఏదైనా కష్టపడితే ఫలితం వస్తుందనే దానికి పరిణీతి నిదర్శనమేమో!