మీరు ప్రెగ్నెంట్ అని తెలుసుకునే 10 లక్షణాలు… అవేంటో తెలుసా?

కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తుంటారు.. కానీ ఈ రోజుల్లో ఇంకా కొన్ని ఊహించని ప్రెగ్నెన్సీ కేసులు ఉంటూనే ఉన్నాయి. కానీ మీరు ప్రెగ్నెంట్ అవునా , కాదా అని తెలుసుకోవటానికి ప్రెగ్నెన్సీ టెస్టు కాకుండా ఇక్కడ ఉన్న కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
1.పిరియడ్స్ మిస్ అవటం :
గర్భం దాల్చటానికి ముందు మహిళలను ఆశ్చర్యపరిచే మెుదటి విషయం పిరియడ్స్ మిస్ అవటం. సాధారంగా ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు పిరియడ్స్ ఆలస్యం అవటం సహజమే.కానీ పదకొండు నుంచి పన్నెండు రోజులు ఆలస్యం అయితే మాత్రం ప్రెగ్నన్సీ టెస్టు చేయించుకోవాలి.
2. మార్నింగ్ సిక్స్ నెస్ :
ఉదయం నిద్రలేస్తూనే వికారంగా అనిపిస్తుంది. నిరసం, అసహాయతగా, శ్వాస తీసుకోవటంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఇలా వారి మెుదటి నెలలో మహిళల్లో జరిగే సాధారణ లక్షణాలు.
3. బ్రెస్ట్ లో హెవీనెస్:
మీ బ్రాస్ సడెన్ గా టైట్ గా మారిపోయాయి. అంటే, మీరు బ్రెస్ట్ లో హెవీనెస్ ని ఫీల్ అవుతున్నారన్నమాట. నిజానికి, కొన్నిసార్లు బ్రా ని తొలగించాలన్నంత హెవీ నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు గర్భం దాల్చడం వలన ఇలా మీకు అనిపించవచ్చు. బ్రెస్ట్ లో నొప్పులు మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ ఉంటే సాధరణ బ్రాస్ ను పక్కనపెట్టి సపోర్టివ్ బ్రాస్ ని ఎంచుకుంటే ఉపయోగం ఉంటుంది. నిపిల్స్ కూడా పెద్దవిగా అవుతూ వాటి షేడ్స్ లో తేడాలు కూడా కనిపించడం కూడా ప్రెగ్నన్సీ లక్షణమే.
4. ఆహారంపై ఎక్కువ కోరిక:
ఇంతకు ముందు మీకు నచ్చని ఆహారంపై సడెన్ గా మీకు మక్కువ ఎక్కువవుతుంది. మరోవైపు, ఇంతకు ముందు మీకు నచ్చిన ఆహారంపై ఇప్పుడు మీకు విముఖత ఏర్పడుతుంది. ఇవి, ప్రెగ్నన్సీ లక్షణాలే. వివిధ ఆహారపదార్థాలపై మీకిలా జరిగితే మీరు ప్రెగ్నెంట్ అయి ఉండడం వలన ఇలా జరిగి ఉండవచ్చు. ఇది కేవలం రుచులకు పరిమితం కాదని మీరు గమనించాలి. కొన్ని సార్లు, గర్భం దాల్చిన మహిళలు కొన్ని రకాల ఆహార వాసనలపై కూడా విముఖతకు ప్రదర్శిస్తారు. మరోవైపు, కొన్ని రకాల ఆహార వాసనలు వారిని అట్రాక్ట్ చేస్తాయి.
5. అలసిపోతూ ఉండటం:
స్టామినా తగ్గినట్టు మీకనిపించినా, నిస్సత్తువగా ఏ పనీ చేయలేని స్థితిలో మీరున్నా ఇవి ప్రెగ్నన్సీ లక్షణాలే. మీరు ఇదివరకు ఇష్టంగా చేసిన కొన్ని పనులను చేయడానికి మీకు శక్తి సరిపోకపోవటం కూడా ఈ లక్షణమే. మీకు నచ్చిన హాబీలను కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతే మీరు కచ్చితంగా హోమ్ ప్రెగ్నన్సీ టెస్ట్ ను చేసుకోవాలి. ఎందుకంటే, ఈ లక్షణాలన్నీ ప్రెగ్నన్సీకి సంబంధించినవే.
6. వికారం:
ఏ విధమైన స్టమక్ ఇన్ఫెక్షన్స్ లేకపోయినా వికారంతో మీరు బాధపడుతున్నట్టయితే, మీరు గర్భం దాల్చడం వలన ఈ అనుభవం మీకు ఎదురై ఉండవచ్చు. మార్నింగ్ సిక్నెస్ కి వికారానికి ఏ మాత్రం సంబంధం లేదు. ప్రెగ్నన్సీ సమయంలో మార్నింగ్ సిక్నెస్ ఎర్లీ మార్నింగ్ లో ఎదురవుతుంది. అయితే, ఈ వికారమనేది సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేయవచ్చు. అయితే, ఈ వికారం లక్షణాలు అలాగే సమయం కూడా ఒక్కొక్క మహిళకు ఒక్కోలా ఉండవచ్చు.
7.భరించలేని నొప్పులు:
రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న మహిళలకు నెలసరి నొప్పులు పరిచయమే. అందువలన, ఈ లక్షణాన్ని సాధారణంగా ఇగ్నోర్ చేస్తారు. అయితే, క్రామ్పింగ్ అనేది దీర్ఘ కాలం కొనసాగితే మీరు కచ్చితంగా ఈ లక్షణంపై దృష్టి పెట్టాలి. గర్భిణీలలో ఈ లక్షణం సహజం. మీరు గర్భం దాల్చిన విషయాన్ని టెస్ట్ చేసుకుని తెలుసుకోండి.
8. ఇంతకు ముందు కంటే మూడీగా ఉంటున్నారు:
మీవారిపై లేదా మీ స్నేహితులపై మీరు అనవసరంగా కోపతాపాలను ప్రదర్శిస్తున్నారా? మీరు ప్రెగ్నెంట్ అవడం వలన ఇలా జరుగుతూ ఉండవచ్చు. ప్రెగ్నన్సీ వలన హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. అందువలన, మీరు మూడీగా మారతారు. అనవసర విషయాలపై కూడా మీకు చికాకు ఏర్పడుతుంది. అయితే, ఈ విషయం గురించి చింత అనవసరం. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి.
9. తరచుగా యూరిన్ కి వెళ్లవలసిన వస్తుంది :
ప్రెగ్నన్సీలో శరీరం అనేక రకాల అదనపు ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. వీటివలన, బ్లాడర్ అనేది ఓవర్ టైం వర్క్ చేయవలసి వస్తుంది. అందువలన, తరచూ మీరు రెస్ట్ రూమ్ వైపు పరుగు పెడుతూ ఉన్నట్టయితే, ఈ లక్షణాన్ని అశ్రద్ధ చేయకండి. ఇది, ప్రెగ్నన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణం. గర్భిణీలలో ఈ లక్షణాన్ని గుర్తించవచ్చు. దీనిని మీరు ముఖ్య సూచనగా గమనించే ముందు మీరు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వలన తరచూ మూత్రానికి వెళ్ళవలసి రావటం లేదన్న విషయాన్ని నిర్దారించుకోవాలి.
10.Unusual intuition :
కొంతమంది మహిళలకు వారు గర్భం దాల్చినట్టు ఒక అనుభూతిని పొందుతారు. దానితో వారు నిర్ధారణ చేయించుకోవటానికి ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుంటారు.
Read: సూర్యరశ్మి.. 34 నిమిషాల్లో వైరస్‌ను చంపేస్తుంది.. వేడి వాతావరణం కరోనా వ్యాప్తిని తగ్గిస్తుంది