జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్లు తమ సొంత ఊర్లకు వెళ్లిపోవాలనే తపనే తప్ప మరొకటి పట్టటంలేదు. రామ్ లీలా మైదానం లోకి ఇంతమంది ఎందుకు వచ్చారో తెలుసుకుందాం..
యూపీలోని పలు ప్రాంతాలకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు మంగళవారం (మే 19,2020) నుంచి బయలుదేరనున్నాయి. ఆ శ్రామిక రైళ్లలో వెళ్లాలంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావటంతో దాన్ని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. దీంతో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వేలాదిమంది వలస కార్మికులు రామ్‌లీలా మైదానాని చేరుకున్నారు.
రాష్ట్రంలో వలస కార్మికులు ఎట్టి పరిస్తితుల్లో కాలినడకన గానీ, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై వెళ్లడానికి అనుమంతించవద్దని ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సుల్ని నడుపుతోంది. కానీ యూపీ పెద్ద రాష్ట్రం. కాబట్టి వలస కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు.
దీంతో యూపీ ప్రభత్వం వలస కార్మికుల తరలింపు కోసం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను అధికసంఖ్యలో నడపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయటం..ఆ రైళ్లలో ప్రయాణించి సొంత ప్రాంతాలకు చేరుకోవటానికి వేలాదిమంది వలస కార్మికులు ఇలా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవటాని రామ్ లీలా మైదానికి చేరుకున్నారు. సొంత ఊర్లకు వెళ్లాలనే తపనతో..భౌతిక దూరం పాటించాలనే నిబంధన పాటించటంలేదు. ఇటువంటి పరిస్థితులు కరోనా వైరస్ మరింతగా వ్యాపించటానికి కారణం కావచ్చు.
#WATCH Ghaziabad: Thousands of migrant workers gather at Ramlila Ground for registering themselves for the three Shramik special trains, which will leave for different parts of Uttar Pradesh later today. pic.twitter.com/SwXhqdpqQf
— ANI UP (@ANINewsUP) May 18, 2020