Three Sisters end life :ఎంతకష్టం తల్లీ..రైలు కింద పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య..తల్లడిల్లుతున్న కళ్లులేని తల్లి

కష్టాలను లెక్క చేయలేదు.తండ్రి చనిపోయినా కళ్లు లేని తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు.కానీ ఏంజరిగిందో గానీ 17 ఏళ్లలోపున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

Three Sisters end life :ఎంతకష్టం తల్లీ..రైలు కింద పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య..తల్లడిల్లుతున్న కళ్లులేని తల్లి

Three Sisters End Life

Updated On : November 19, 2021 / 5:44 PM IST

Three Sisters Suicide : తల్లీ తండ్రీ ఓ కొడుకు..ముగ్గురు కూతుళ్లు. ఆడపిల్లలంతా 16, 14, 11 ఏండ్ల వ‌యసున్నవారు. పేదవారే అయినా ఉన్నంతలో హాయిగానే ఉండేవారు.కష్టాలు ఉన్నా..కాయకష్టం చేసి జీవించేవారు. మరి దేవుడు వీరు సహనానికి పరీక్ష పెట్టాలనుకున్నాడో ఏమోగానీ..తండ్రిని తన దగ్గరకు తీసుకుపోయాడు. తండ్రి మరణం ఆ కుటుంబాన్ని కృంగదీసింది. కానీ కోలుకుంది. కష్టపడి జీవించటం అలావాటు చేసుకుంది. తండ్రి చనిపోయిన ఆరేళ్లకు తల్లికి కంటిచూపు పోయింది.వైద్యం చేయించే స్తోమత ఆ చిన్నారులకు లేదు. అలాగే తోడబుట్టినవాడితో పాటు కాయకష్టం చేసుకుంటు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు పిల్లలు నలుగురు. కానీ అక్కడికి వారి కష్టాలు తీరలేదు.

Read more : Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

న‌లుగురు పిల్ల‌లు క‌లిసి దొరికిన ప‌న‌ల్లా చేస్తూ..వచ్చినదాంతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఉన్న‌ట్టుండి ముగ్గురు అక్కాచెల్లెళ్లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో 16 ఏళ్ల ప్రీతి, 14 ఏళ్ల కాజ‌ల్, 11 ఏళ్ల ఆర్తి చనిపోయారు.గురువారం (నవంబర్ 18,2021) రాత్రి ఒకేసారి వేగంగా వెళ్తున్న రైలు కింద‌పడి ప్రాణాలు తీసుకున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం జాన్‌పూర్ జిల్లా బ‌ద్లాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఫ‌ట్టుపూర్ ద‌గ్గ‌ర సుల్తాన్‌పూర్ రైల్వే క్రాసింగ్‌పై జ‌న్‌సాధార‌ణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందప‌డి వాళ్లు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. క‌టిక పేద‌రికంతో విసిగిపోవ‌డ‌మే ఆ పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌ని పోలీసుల చెబుతున్నారు. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పిల్ల‌లు రాత్రి 11 గంట‌ల‌కు ఫ‌ట్టుపూర్ ద‌గ్గ‌ర విగ‌త‌జీవులుగా మారారు.

Read more : Delhi Pollution..NASA : ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో చెప్పిన నాసా

దీంతో కళ్లులేని తల్లి బిడ్డల కోసం గుండెలవిసేలా ఏడుస్తోంది. కష్టమైనా ఏదైనా కలిసే బతికాం కదక్కా..ఎందుకు నన్ను..అమ్మను వదిలిపోయారు? అని సోదరుడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కానీ తండ్రి చనిపోయాక కూడా తొమ్మిదేళ్లపాటు కుటుంబం కోసం ఇంతగా కష్టపడిన ఆడపిల్లలు ఇలా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.