Delhi Pollution..NASA : ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో చెప్పిన నాసా

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం రీత్యా దీపావళి బాణసంచా కాల్చటంపై నిషేధం జరుగుతోంది. ఈక్రమంలో ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో నాసా వెల్లడించింది.

Delhi Pollution..NASA : ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో చెప్పిన నాసా

Delhi Pollution..nasa

pollution in Delhi is, and no, it’s not Diwali crackers : NASA :  ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక శీతాకాలం వచ్చిదంటే చాలు…పక్కన నడిచే మనిషి కూడా కనిపించనంత కాలుష్యం ఉంటుంది. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన విషయం తెలిసిందే. నగర కాలుష్యానికి రైతులపై నెపాన్ని నెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కాలుష్యం వల్ల ఢిల్లీలో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ఇవ్వాల్సిన వచ్చింది. ఇదిలా ఉంటే రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఢిల్లీలో శీతాకాలం అంటే..ముఖ్యంగా నవంబర్–డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Read more : Delhis Air Pollution : దీపావళికి ముందే..కాలుష్యంతో మసకబారుతున్న ఢిల్లీ

ఢిల్లీలో వాయు కాలుష్యానికి పరిశ్రమలు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంటల వ్యార్ధాల దగ్థం, వాహన కాలుష్యం,బాణసంచా కాల్చడం వంటివి కొంత ఆజ్యం పోస్తున్నాయని తెలిపింది. ఈ కాలుష్యం బాణసంచా కాలుష్యానికి తోడయ్యాయని తెలిపింది.   విజిబుల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ (VIIRS) ద్వారా ఈ ఏడాది నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎన్పీపీ శాటిలైట్ ద్వారా ఫొటోలను తీసింది. ఆ రోజు పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఢిల్లీ వైపు భారీ మొత్తంలో పొగ తరలివచ్చిందని అదే కాలుష్యం మరింతగా పెరగటానికి కారణమని తేల్చి చెప్పింది.దానికి తోడు పాకిస్థాన్ పంట వ్యర్థాలు కూడా తోడయ్యాయని నాసా పేర్కొంది.

Read more : Pollution- Corona : కాలుష్యం పెరుగుతోంది..కరోనా మరణాలు కూడా పెరిగే అవకాశం: డాక్టర్ గులేరియా

ఆ ఒక్కరోజే పొగ వల్ల 2.2 కోట్ల మంది పెను ప్రభావానికి లోనయ్యారని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు. నవంబర్ 12న దాని ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని చెప్పారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలూ కాలుష్యం పెరగడానికి కారణమన్నారు. కాగా, పంజాబ్, హర్యానాల్లో కలిపి 17 వేల హాట్ స్పాట్లున్నట్టు నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త హీరేన్ జేథ్వా చెప్పారు. భారత దేశ రాజధానిలోని సెన్సార్‌లు నవంబర్‌లో అనేక సందర్భాల్లో క్యూబిక్ మీటరుకు 400 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM 2.5 మరియు PM 10 స్థాయిని నమోదు చేశాయని, ఇది WHO సిఫార్సు చేసిన క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ అని NASA తెలియజేసింది.