Today Headlines : రేవంత్ రెడ్డికి జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల స్వాగతం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు.

రేవంత్ రెడ్డికి జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల స్వాగతం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. రేవంత్ రెడ్డికి జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయులు కొందరు స్వాగతం పలికారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి టీమ్ అక్కడకు వెళ్లింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పొత్తులపై మాయావతి క్లారిటీ
లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దేశంలో ఏ కూటమితోనూ పొత్తులు పెట్టుకోబోమని చెప్పారు. మరికొన్ని నెలల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ప్రధాన పార్టీలన్నీ పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి.
జీవితాంతం నేను టీడీపీలోనే ఉంటాను: యరపతినేని
తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. తనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి తమ కుటుంబం ఆ పార్టీలోనే ఉందన్నారు. జీవితాంతం నేను టీడీపీలోనే ఉంటానని అన్నారు.
రెండోరోజు రాహుల్ యాత్ర..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కళాపహర్, కంగ్‌పోప్కి నుంచి రెండో రోజు యాత్ర మొదలైంది. రాహుల్ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు చంద్రబాబు కేసులపై సుప్రీంకోర్టు తీర్పు.. రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక పూజలు
ఎంపీ రఘురామ కృష్ణంరాజు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు అన్నారు. రేపు ఒంటిగంటకు చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పురానున్నదని తెలిపారు. 17a చంద్రబాబు కేసులో వర్తిస్తుంది అనేది కోర్టు తీర్పు ద్వారా రుజువు అవుతుందని ఆశిస్తున్నానని, అలాగే జరగాలని మావుళ్ళమ్మను కోరుకున్నట్టు చెప్పారు.
పోటెత్తిన భక్తులు..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది. మల్లన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మంచు దుప్పటి ..
ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి కమ్మేసింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రావాల్సిన సుమారు 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 79 విమానాలు రద్దయ్యాయి.
నారావారిపల్లెలో సంక్రాంతి..
నారావారి పల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గోనున్నారు. తొలుత గ్రామ దేవత దొడ్డి గంగమ్మ, కులదైవం నాగాలమ్మకు పూజలు చేస్తారు. అనంతరం తల్లిదండ్రులకు చంద్రబాబు నివాళులర్పిస్తారు.
మరకజ్యోతి దర్శనం..
ఇవాళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణు ఘోషతో శబరిమల మార్మోగుతోంది.
దావోస్ కు రేవంత్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్ కు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన సాగనుంది.
ప్రధాని వర్చువల్ భేటీ ..
నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల గిరిజన ప్రాంతాల్లో చెంచులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ భేటీ కానున్నారు.