Today Headlines : తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు  కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది.

Today Headlines : తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

11PM Headlines

తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యువగళమా?: విజయసాయి రెడ్డి ప్రశ్న
‘‘యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే దరిద్రపు కార్యక్రమమా లోకేశ్? వాళ్లు తొడుక్కున్న యూనిఫాం నువ్వు ఇచ్చింది కాదు. అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తివి. వాళ్ల చదువుల గురించి కొంచెం అయినా బాధ్యత ఉందా? పసిపిల్లలతో పాదాలకు నమస్కారాలు పెట్టించుకోవడం అమానవీయం కాదా?’’ అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వ్యూహం మార్చిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగుకు సమయం సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాలు దాటి ఎవరూ బయటికి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.
విభజన చట్టం నిబంధనలకు తెలంగాణ వ్యతిరేకం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ, నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల అంశాలపై చర్చించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జల శక్తిశాఖ నిర్ణయించింది.
కాంగ్రెస్‎లో సమర్థవంతమైన నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైెఎస్ షర్మిలా.. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని అని ఆమె అన్నారు. ఉత్తమ్, భట్టి లాంటి క్రమశిక్షణ గల నేతలు చాలా మంది ఉన్నారని, అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ నేతలవి లేకిబుద్ధులు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్‌కు exact పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందన్నారు. అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లా వచ్చి తెలంగాణకు వచ్చి పడుతున్నారు అంటూ మండిపడ్డారు.
93 వ పుట్టినరోజు జరుపుకున్న ట్రిప్లెట్స్
USA కి చెందిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్) తమ 93 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన ట్రిప్లెట్స్‌గా గిన్నిస్ రికార్డు సాధించారు.

గ్రీన్‌సిగ్నల్‌
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఈసీ గుడ్‌న్యూస్‌..DA చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

కాంగ్రెస్ కాలింగ్..డీకే డైరెక్షన్
రేపే తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్. దీంతో ఢిల్లీ నుంచి కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తెలంగాణకు క్యూ కట్టారు. దీంట్లో భాగంగానే మరి కాసేపట్లో హైదరాబాద్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం
డీకే శివకుమార్..రానున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీ కానున్నారు. తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.

కమ్మేస్తోంది..
ఢిల్లీలో వెదర్‌ ఎఫెక్ట్‌తో 18 విమానాలు దారి మళ్లింపు..విమానాల ఆలస్యంపై ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈడీ హీట్‌
ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై చార్జిషీట్‌ దాఖలు చేసింది.

కేంద్రం ఫోకస్‌
కృష్ణా జలాల పంపకం వివాదంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 6న తెలుగు రాష్ట్రాల CSలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది.

ఇదేం రాజకీయం!
అసైన్డ్‌ భూముల రికార్డులు మారుస్తున్నారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలవి చిల్లర రాజకీయాలు అంటూ మండిపడ్డారు.

ఆదిత్య రిపోర్ట్‌ ..
సౌరగాలులను ఆదిత్య ఎల్‌-1.. రికార్డ్‌ చేసింది. దీనికి సంబంధించి ఇస్రో ఫొటో షేర్‌ చేసింది.

మళ్లీ బాంబుల మోత..
గాజాపై ఇజ్రాయెల్‌.. మళ్లీ దాడులు ప్రారంభించింది. 400 టార్గెట్లపై అటాక్‌ చేసింది.ఈ దాడుల్లో 170 మందికి పైగా మృతి చెందారు.

జనసేనతోనే సాధికారత..
ప్రతికూల పరిస్థితుల్లో జనసేన పార్టీని స్థాపించానని 10 ఏళ్లుగా పార్టీని నడిపిస్తు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో భవిష్యత్ కార్యక్రమాలపై కేడర్ కు దిశానిర్దేశం చేస్తు పవన్ బీసీలు సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. బీసీలకు నిజమైన సాధికారత జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు.2024 ఎన్నికలకు చాలా కీలకమైనవని ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలవారికి నిర్ణయాత్మక శక్తి ఉండాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేసిన పవన్ జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషంలేదని అన్నారు.

జనసేనలో చేరిన వైసీపీ నేతలు
తూర్పుగోదావరిజిల్లాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పవన్ ఆహ్వానించారు. ఏపీలో వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని పవన్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ముఖ్యనేతలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చేసి చూపిస్తానని అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డామని, కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చామని అన్నారు.

కాంగ్రెస్‌ కంప్లైంట్‌
తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఈవో వికాస్ రాజ్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. రైతుబంధు నిధులు మళ్లిస్తోందని..కమీషన్ల కోసం నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

హైకమాండే ఫైనల్‌
కాంగ్రెస్‌లో సమర్థమంతమైన నేతలు చాలా మంది ఉన్నారని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఎవరిని సీఎం చేయాలన్నది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్‌ ఫోకస్‌
రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ అగ్ర నేతలు తరలిరానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వారు తెలంగాణకు రానున్నారు. దీంట్లో భాగంగా చిదంబరం,సుశీల్ కుమార్, సుర్జేవాలా వంటి నేతలు హైదరాబాద్ కు రానున్నారు.

ఉద్రిక్తత..
SV ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి బలవన్మరణంపై ఆందోళన చోటుచేసుకుంది. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవన్‌ను విద్యార్ధులు ముట్టడించారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది.

సహకరించండి..
డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. దీంట్లో భాగంగా ఈరోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్‌ సమావేశాలకు విపక్షాలు సహకరించాలి..అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న ప్రహ్లాద్‌ జోషి కోరారు.

దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు.. 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అంతకుముందు ఆలయం వద్ద చంద్రబాబుకు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్ధా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.

జోరుగా బెట్టింగ్ లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌వేళ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపైన బెట్టింగ్‌ జరుపుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులనే ఎక్కువ గా అంచనావేసి బెట్టింగులకు దిగుతున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని ఒకరు, లేదు BRS మూడవ సారి హ్యాట్రిక్ సాధిస్తుందని మరొకరు… హంగ్ వస్తుందని ఇంకొకరు బెట్టింగ్‌లు వేస్తున్నారు.

మహిళలకు పుతిన్ విజ్ఞప్తి..
రష్యాలో జననాల సంఖ్య రోజురోజుకు పడిపోతుండడంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ కొత్త సలహా ఇచ్చారు. దేశంలోని మహిళలు ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో పుతిన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రష్యాలో జనాభా పెంచడమే తమ ప్రధాన లక్ష్యంగా పుతిన్ వెల్లడించారు. ‘దేశంలోని చాలా మంది జాతుల ప్రజలు నలుగురు, ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్నికంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. మన పాతతరం ఒక్కొక్కరు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలనుకన్నారని, ఆ అద్భుతమైన సంప్రదాయాలను మనమూ కాపాడుకుందామని పుతిన్ ఆ దేశ మహిళలకు పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్‌ దాడిలో 178 మంది మృతి ..
కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజాలో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్‌ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి.