Virat Kohli Birthday: నేడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే.. విరాట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ..
క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల వీరుడు, చేజింగ్ మాస్టర్ ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రికార్డుల మోత మోగించిన కింగ్ కోహ్లీ నేడు 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు, ప్రముఖులు, అభిమానులు కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Virat Kohli Birthday
Virat Kohli Birthday: భారత్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ శనివారం 34వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సహర జట్టు సభ్యులు, తోటి క్రీడాకారులు, ప్రముఖులు విరాట్ కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Virat Kohli 34th Birthday
1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్.. తన ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంకు చేరుకున్నాడు. కోహ్లీ తల్లి గృహిణికాగా తండ్రి క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. తన ఇద్దరు తోబుట్టువులతో కలిసి కోహ్లీ ఉత్తమ్ నగర్‌లో పెరిగాడు. కోహ్లీ విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో చదివాడు.

Virat Kohli 34th Birthday
కోహ్లీ 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు. 2002లో ఢిల్లీ అండర్-15 జట్టుతో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. 2003-2004 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీకి జట్టు కెప్టెన్ అయ్యాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-17 జట్టుకు 2004లో ఎంపికయ్యాడు.

Virat Kohli 34th Birthday
కోహ్లీ మొదటిసారిగా నవంబర్ 2006లో తమిళనాడు క్రికెట్ జట్టుతో ఆడాడు. అదే ఏడాది ఢిల్లీ అండర్-19 జట్టుకు ఎంపికైన కోహ్లీ వారితో కలిసి ఇంగ్లండ్‌లో పర్యటించాడు. కోహ్లీ ఏప్రిల్ 2007లో తన టీ20లో అరంగేట్రం చేశాడు. అంతర్-రాష్ట్ర T20 ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనేక విజయాలు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 2021 ఐపీఎల్ గేమ్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు. 6,000 ఐపీఎల్ పరుగులను చేరుకున్న మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

Virat Kohli 34th Birthday
ఐసీసీ వరల్డ్ టీ20 మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కోహ్లీ రెండుసార్లు గెలుచుకున్నాడు. 23,000 అంతర్జాతీయ పరుగులతో అత్యంత వేగవంతమైన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

Virat Kohli 34th Birthday
ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీతో సహా పలు అవార్డులను అందుకున్నాడు. కోహ్లి ఈఎస్పీఎన్- ర్యాంక్ పొందిన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడాకారుడు. ‘‘ఫోర్బ్స్” మ్యాగజైన్ అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుడు. “టైమ్” మ్యాగజైన్ యొక్క ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో కోహ్లీ ఒకరిగా నిలిచాడు.

Virat Kohli 34th Birthday
కోహ్లీకి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే ఇష్టం. దీంతో ఎఫ్‌సీ గోవా అనే ఐఎస్ఎల్ క్లబ్‌కు సహ యజమానిగా ఉన్నాడు. యూఏఈ రాయల్స్ అనే టెన్నిస్ లీగ్ ఫ్రాంచైజీని కూడా కలిగి ఉన్నాడు. భారతదేశంలో చిసెల్ అనే జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించాడు.

Virat Kohli 34th Birthday
కోహ్లి 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది.