Tollywood Stars : సమయం లేదు మిత్రమా.. ఇక షూటింగ్ స్టార్ట్..
సమయం లేదు మిత్రమా.. అంటూ షూటింగ్స్‌కి తొందర పడుతున్నారు సినిమా వాళ్లు.. జాగ్రత్త పడాల్సిందే తప్ప.. వేరే దారి లేదని ఇప్పటికే రిస్క్ చేస్తూ షూటింగ్స్ మొదలు పెట్టారు కొంత మంది స్టార్లు..

Heroes
Tollywood Stars: సమయం లేదు మిత్రమా.. అంటూ షూటింగ్స్‌కి తొందర పడుతున్నారు సినిమా వాళ్లు. జాగ్రత్త పడాల్సిందే తప్ప.. వేరే దారి లేదని ఇప్పటికే రిస్క్ చేస్తూ షూటింగ్స్ మొదలు పెట్టారు కొంత మంది స్టార్లు. వెయిట్ చేద్దాం అని ఆలోచిస్తున్న మహేష్ బాబు, బన్నీ, పవన్ లాంటి హీరోలు కూడా ఇక ఆగి లాభం లేదని షూటింగ్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఎప్పుడో ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.
పరిస్థితులు బాలేక సంవత్సరం నుంచి సినిమాల షెడ్యూల్స్ అన్నీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు నెక్ట్స్ మంత్ నుంచి సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాలు కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్‌లో తెరకెక్కుతున్న ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ మూవీ జూలై ఫస్ట్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు.
బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమా కూడా జూలై ఒకటి నుంచి గండిపేటలో షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. బాలయ్య షూటింగ్‌ని భారీ ఫైట్‌తో స్టార్ట్ చేసి తర్వాతే మిగిలిన షూట్ కంప్లీట్ చేస్తారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ‘ఎఫ్ 3’ ని ఆగస్ట్ 27న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.
వీళ్లతో పాటుగా మిగిలిన స్టార్ హీరోలు కూడా షూటింగ్ చెయ్యడానికి షెడ్యూల్స్ వేసుకున్నారు. బన్నీ -సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ షూటింగ్ జూలై అయిదు నుంచి భూత్ బంగ్లాలో జరుగబోతోంది. 2 పార్ట్స్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి ఇంకా 10 టు 20 పర్సెంట్ మాత్రమే షూటింగ్ మిగిలుంది. ఈ షూట్‌ని కంప్లీట్ చేసి ఆగస్ట్ 13 నే రిలీజ్ ఫిక్స్ చేద్దామని డిసైడ్అయ్యారు టీమ్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ .. ఈ సారి కూడా అందరికన్నా లేట్‌గా షూటింగ్ మొదలు పెడుతున్నారు సూపర్‌స్టార్.. మహేష్, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ జూలై ఏడు నుంచి హైదరాబాద్‌లో షూట్ కంటిన్యూ చెయ్యబోతోంది. ఇప్పటికే ఫారెన్‌లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘సర్కారు వారి పాట’ ఈ సారి తక్కువ రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చెయ్యబోతున్నారు.