చత్తీస్ గఢ్ : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

చత్తీస్ గఢ్ : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

Updated On : January 7, 2021 / 3:13 PM IST

Tribal Groom married Two brides at same time in Chhattisgarh : ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే వేగలేక మొగవాళ్లు భార్యలపై సెటైర్లు వేస్తుంటే….. చత్తీస్ గఢ్ కు చెందిన యువకుడు ఒకేసారి ఇద్దరు పెళ్ళాలకు తాళికట్టి ఏడడుగులు వేశాడు. చత్తీస్ గఢ్ లోని గిరిజన గ్రామంలో ఇటీవల విచిత్ర వివాహం జరిగింది. ఇద్దరు వధువులు, ఒకేసారి, ఒకే ముహూర్తానికి, ఒకే వేదికపై తాళి కట్టించుకున్నారు….వారికి తాళి కట్టిన వరుడు ఒక్కడే. ప్రస్తుతం ఈ వివాహం చత్తీస్ గఢ్ రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.

బస్తర్ జిల్లా, జగదల్పూర్ సమీపంలోని తిక్రాలోహంగా అనే గ్రామంలో చందు మౌర్య అనే యువకుడు, హసీనా (19) సుందరి(21) అనే ఇద్దరు యువతుల మెడలో ఒకేసారి తాళికట్టాడు. గతంలో చందు ఈ ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. అయితే పెళ్లి చేసుకునే విషయం వచ్చే సరికి ఎవరినీ వదులుకోలేక పోయాడు. అందుకని ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించి, ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.
tribal marriage

ఇందుకు గ్రామ పెద్దలు అందరూ అంగీకారం తెలిపారు. వీరి వివాహం జరిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వింతేమీ లేదని… తమ ఆచారం ప్రకారం ఇది సమ్మతమేనని గిరిజన పెద్దలు చెప్పటం కొసమెరుపు. కాగా ఈవివాహం గురించి తమకు ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.