Telangana : బిల్లులు పెండింగులకు కారణం గవర్నరే .. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర : టీఆర్ఎస్ నేత వినోద్

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ కుట్రలు చేస్తోందని దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కాకుండా తమిళిసై బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని..అందుకే బిల్లులకు ఆమోదం తెలుపకుండా పెండింగ్ లో పెట్టారని టీఆర్ఎస్ నేత వినోద్ ఆరోపించారు.

Telangana :  బిల్లులు పెండింగులకు కారణం గవర్నరే .. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర :  టీఆర్ఎస్ నేత వినోద్

TRS leaders criticize Governor Tamilisai on pending bills

Updated On : October 26, 2022 / 4:03 PM IST

Telangana :  తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ కుట్రలు చేస్తోందని దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కాకుండా తమిళిసై బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని..అందుకే బిల్లులకు ఆమోదం పలకకుండా పెండింగ్ లో పెట్టారని టీఆర్ఎస్ నేత వినోద్ ఆరోపించారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని..అందుకే బిల్లుల్ని గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. బీజేపీ ఏతర రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ఆరోపించారు. బీజేపీ తల్లక్రిందులుగా తపస్సు చేసిన మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సేనని అన్నారు.బీజేపీ చేసే కుట్రలు పెట్టే ఇబ్బందుల్ని మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని అందుకే టీఆర్ఎస్ కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు వినోద్. మునుగోడులో బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కదన్నారు.

కాగా..అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను పరిశీలించి త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని.. బిల్లుల ఆమోదం అనేది పూర్తిగా నా పరిధిలోని అంశమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పష్టంచేశారు. అలా కొంతకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో భాగంగా తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు గవర్నర్ వద్దకు రాగా వాటికి ఆమోద ముద్ర వేయకుండా పెండింగ్ లోపెట్టారు. దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం జీర్ణయించుకోలేకపోతోంది. పలు విమర్శలు చేస్తోంది గవర్నర్ పై . దీంట్లో భాగంగానే టీఆర్ఎస్ నేత వినోద్ గవర్నర్ పై విమర్శలు సంధించారు. గవర్నర్ కావాలనే బిల్లులను పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు.

రాజ్‌భవన్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా పలువురు ప్రముఖులు, బీజేపీ నాయకులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని అయితే పరిధిలోకి లోబడే వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్న తమిళి సై గవర్నర్‌గా బాధ్యతలు తెలుసని అదేవిధంగా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.