Pesticides Sale E-Commerce : ఇక ఇంటి వద్దకే పురుగు మందులు.. ఈ-కామర్స్‌లో కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రైతులకు శుభవార్త. పంటలకు వినియోగించే పురుగు మందుల కోసం ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లవలిసిన అవసరం లేదు. ఇక మీ ఇంటి వద్దకు వచ్చి పురుగు మందులు ఇస్తారు. బట్టలు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లుగానే పురుగు మందులను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Pesticides Sale E-Commerce : ఇక ఇంటి వద్దకే పురుగు మందులు.. ఈ-కామర్స్‌లో కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

pesticides sale e-commerce

Updated On : November 30, 2022 / 10:26 AM IST

Pesticides Sale E-Commerce : రైతులకు శుభవార్త. పంటలకు వినియోగించే పురుగు మందుల కోసం ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లవలిసిన అవసరం లేదు. ఇక మీ ఇంటి వద్దకు వచ్చి పురుగు మందులు ఇస్తారు. బట్టలు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లుగానే పురుగు మందులను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా పురుగుల మందుల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. లైసెన్సులు పొందిన వ్యాపారులు నిబంధనలకు లోబడి ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఏ పురుగు మందునైనా రైతన్న ఇంటికే సరఫరా చేయవచ్చని తెలిపింది.

Sorghum Crop Cultivation : కందిపంటకు నష్టం కలిగించే కాయతొలుచు పురుగులు, నివారణ చర్యలు!

ఈ నిర్ణయంతో పురుగు మందుల తయారీదారులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. అలాగే, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రైతులు సులభంగా పురుగుల మందులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.