Pushing a bus: నడిరోడ్డుపై ఆగిపోయిన బస్సును.. ప్రయాణికులతో కలిసి నెట్టిన కేంద్ర మంత్రి.. వీడియో
ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నడిరోడ్డుపై ఉండిపోయింది. డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినా ఆ బస్సు స్టార్ట్ కావడం లేదు. దీంతో పలువురితో కలిసి అనురాగ్ ఠాకూర్ ఆ బస్సును వెనక్కు నెట్టారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనాలు ముందుకు కదిలాయి. అనురాగ్ ఠాకూర్ కూడా వెళ్లిపోయారు.

Pushing a bus: నడిరోడ్డుపై ఆగిపోయిన బస్సును ప్రయాణికులతో కలిసి నెట్టారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లోని ఓ రహదానిపై ప్రయాణిస్తున్నారు. అయితే, ఆయన కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. భారీ ట్రాఫిక్ కు కారణమేంటని ఆయన కారు దిగి చూశారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నడిరోడ్డుపై ఉండిపోయింది. డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినా ఆ బస్సు స్టార్ట్ కావడం లేదు.
దీంతో పలువురితో కలిసి అనురాగ్ ఠాకూర్ ఆ బస్సును వెనక్కు నెట్టారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనాలు ముందుకు కదిలాయి. అనురాగ్ ఠాకూర్ కూడా వెళ్లిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, హామీలు ఇస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెల్లడవుతాయి.
#WATCH | Union Minister Anurag Thakur was seen pushing a bus that broke down in the middle of a highway causing a traffic jam in Himachal’s Bilaspur.
The Minister’s convoy was also stuck in traffic pic.twitter.com/2EPNLKGSJb
— ANI (@ANI) November 8, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..