Ram Charan: అమెరికాలో చరణ్ ఫ్యాన్స్ హంగామా!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి.....

Usa Ram Charan Fans Celebrate Rrr
Ram Charan: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఆర్ఆర్ఆర్‌ను చూసేందుకు ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. కాగా ఈ సినిమాను చూసేందుకు ఇక్కడి ఆడియెన్స్‌తో పాటు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఓవర్సీస్‌లో అప్పుడే ఈ చిత్ర టికెట్ల ప్రీబుకింగ్స్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులు వారే..?
ఈ క్రమంలో ఓవర్సీస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకుంటూ అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోల అభిమానులు తమ హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల తారక్ ఫ్యాన్స్ విమానంపై ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిర్వహించి తమ అభిమానాన్ని చుటుకున్నారు.
Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ ఆ పాటలో ఉన్న వాళ్లంతా యుక్రెయిన్‌లే.. నాకు తోచిన సహాయం చేశాను..
తాజాగా చరణ్ ఫ్యాన్స్ యూఎస్‌లోని న్యూయార్క్ సిటీలో నిత్యం బిజీగా ఉండే టైమ్స్ స్వేర్ వద్ద ఉన్న ఓ బిల్‌బోర్డ్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన వీడియోను ప్లే చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధంగా చరణ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు అక్కడి ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Aaatt!! ??? Celebrations on fire by USA @AlwaysRamCharan fans!! ? #RRRMovie pic.twitter.com/tNZwiOIMLL
— RRR Movie (@RRRMovie) March 17, 2022