NeelaKurinkji : 12 ఏళ్లకు పూసే ‘నీలకురింజి’ పువ్వులు.. నీలిరంగులో వెలిగిపోతున్న షాలోం కొండలు

12 సంత్సరాలకు ఒక్కసారి పూసే ‘నీలకురింజి’ పువ్వులు ఈ ఏడాది విరగబూశాయి. దక్షిణభారతదేశంలోని పశ్చిమకనుమల్లో షోల అడవుల్లో ఉంటాయి ఈ మొక్కలు.కేరళలోని సంతానపర పంచాయితీ పరిధిలోని ఇడుక్కిలోని శలోం కున్ను (శలోం కొండలు)ల్లో నీలకురింజి పువ్వులు విరబూసి కనువిందు చేస్తున్నాయి.

NeelaKurinkji : 12 ఏళ్లకు పూసే ‘నీలకురింజి’ పువ్వులు.. నీలిరంగులో వెలిగిపోతున్న షాలోం కొండలు

Neelakurinkji (5)

Updated On : August 2, 2021 / 3:21 PM IST

Very rear NeelaKurinkji flowers bloom in shalom hills after 12 years : వాన చినుకు పడితే ఆకులు చిగురిస్తాయి. పువ్వులు వికసిస్తాయి. ఒక్కో పువ్వుది ఒక్కో ప్రత్యేకత. అందంలోను..సువ్వాసనలోను వేది ప్రత్యేకతలు వాటివే. కొన్ని అరుదైన పువ్వులు కొన్ని కొన్ని ఏరియాల్లోనే పూస్తాయి. ఆయా ప్రాంతాలకు ఆయా రకాలు పువ్వులు ప్రత్యేకతను తెస్తాయి. అటువంటి అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు ‘నీలకురింజి’. నీలకురింజి మొక్కలు పూసే ఈ నీలకురింజి పువ్వులను చూడాలంటే 12ఏళ్లు పడుతుంది. రూపంలోనే కాదు గుణంలో కూడా ఈ నీలకురింజి పువ్వు. ఈ పువ్వు పేరుతో ఓ దేవాలయమే ఉంది అంటే నీలకురింజి పువ్వుల విలువ గురించి అర్థం చేసుకోవాల్సిందే.

గుబురు పొదకు చెందిన చిన్న మొక్క నీలకురంజి. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో కనిపిస్తుంది. ఇది నీలి రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని నీలకురింజి అని పిలవటం ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క పువ్వుల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి నీలకురింజి పువ్వులో కేరళలోని సంతానపర పంచాయితీ పరిధిలోని ఇడుక్కిలోని షాలోం కున్నులు (షాలోం కొండలు) ఈ ఏడాది విరబూసి కనువిందు చేస్తున్నాయి. వాటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అంత అందం వీటి సొంతం.

దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని షోలా అడవులలో కనిపించే ఒక పొద నీలకురింజి మొక్క. నీలగిరి కొండలు అంటే నీలకురింజి మొక్కలు అక్కడ పూస్తాయి కాబట్టి ఆ పర్వతాలను ఈ పేరు వచ్చిందట. అటువంటి అద్భుతమైన నీలకురింజి పువ్వులు 12 సంవత్సరాల తర్వాత శలోం కొండలలో విరిసిన కొండలకు నీలి రంగును పులిమాయి. శలోం కొండలలో ఈ ఏడాది 10 ఎకరాలకుపైగా ప్రాంతంలో విరబూశాయి. ఈ పువ్వులు విరబూసిన సమయంలో వాటిని చూసేందుకు పర్యాటకు భారీగా తరలి వస్తారు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం పర్యాటకులను అనుమతించలేదు.

కాగా ఈ మొక్క 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వులు పూసే సమయంలో ఈ మొక్కలు ఉండే ప్రాంతం అంతా నీలాకాశం కిందకు దిగి వచ్చిందా? అన్నట్లుగా నీలిరంగులోకి మారిపోతుంది. ప్రకృతిలోని అందం మొత్తం అక్కడే కొలువు తీరిందా?అక్కడే రాశి పోయిందా? అన్నట్లుగా ఉంటుంది. ఈ మొక్కలు కేరళలోని మున్నార్, తమిళనాడులోని కొడైకెనాలా ప్రాంతాల్లో పూస్తాయి. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా పూసే ఈ మొక్కలు తూర్పు కనుమల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తాయి.

కురింజు పువ్వు పేరుతో దేవాయలం..
కురింజి పువ్వు పేరుతో ఉండే దేవాలయం హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ లో ఉందీ కురింజి అండవర్ దేవాలయం కొడైకెనాల్ సరస్సుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాయలంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు.అంటే సుబ్రమణ్యస్వామి. కురింజి అంటే పర్వతం అని అర్థం. అండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం. కురింజి అండవార్ అంటే పర్వత దేవుడు అని అర్థం. కుమారస్వామి కైలాసం నుంచి మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ పర్వతం మీదనే దిగాడట. అప్పుడు కుమారస్వామి భార్య వల్లీ ఆయన్ని 12 ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురంజి పువ్వుల దండతో మెడలో వేసి స్వాగతం పలికిందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయిని లేడీ రామనాథన్ అంటారు. ఈ ఆలయం ఇపుడు అరుల్మిఘు దండయుతపాణి స్వామి తిరు కోవిల్ క్రింద ఉంది.