West Indies vs India: ట్రినిడాడ్ చేరుకున్న టీమిండియా.. వీడియో
ఇంగ్లండ్‌తో ఆ దేశంలో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా వెస్టిండీస్‌తో జరిగే టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడి టీమ్ ఇవాళ ఉదయం ట్రినిడాడ్‌కు చేరుకుంది.

Teaminida
West Indies vs India: ఇంగ్లండ్‌తో ఆ దేశంలో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా వెస్టిండీస్‌తో జరిగే టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడి టీమ్ ఇవాళ ఉదయం ట్రినిడాడ్‌కు చేరుకుంది. భారత క్రికెటర్లు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వెస్టిండీస్‌తో తొలి వన్డే ఈ నెల 22న, 2వ వన్డే 24న, 3వ వన్డే 27న జరగనుంది. ఈ మూడు మ్యాచులూ ట్రినిడాడ్‌లోనే జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా దూరంగా ఉన్నారు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్, రుతు రాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హూడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు.
Trinidad – WE ARE HERE! ??#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
China: ‘తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు’.. అమెరికాకు చైనా వార్నింగ్