Woman dance viral : ఇదేం డ్యాన్స్ బాబోయ్… రైల్వే ప్లాట్‌ఫామ్ మీద లేడీ పిచ్చిగంతులు చూసి నెటిజన్లు ఫైర్
వైరల్ .. వైరల్.. ప్రపంచమంతా ఎలా వైరల్ అవ్వాలా అని ఆలోచిస్తోంది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఏదైనా చేసి సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలని తాపత్రయపడిపోతున్నారు. రీసెంట్‌గా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ చూడండి.

Woman dance viral
Woman dance viral : రైల్వే స్టేషన్లలో వైరల్ అవుతున్న వీడియోలు అనేకం. రీసెంట్ గా ఓ అమ్మాయి చేసిన డాన్స్ మాత్రం జనాల్ని బెంబేలెత్తించింది. ఇదేం పబ్లిసిటీ స్టంట్ రా బాబు.. అని జనాలు బుర్రలు పట్టుకుంటున్నారు.
పొంగల్ వేడుకల్లో వృధ్ధ మహిళ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా
కొన్ని వీడియోలు చూస్తుంటే పిచ్చి పలు విధములు అనిపిస్తోంది. రీసెంట్‌గా రైల్వే స్టేషన్‌లో ఓ అమ్మాయి చేస్తున్ డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది. రైల్వే స్టేషన్లు ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా ప్లాట్‌ఫామ్ మీద రైలు ఎక్కేవారు దిగేవారు హడావిడిలో ఉంటారు. ఓ ట్రైన్ ఆగి ఉన్నా జనాలు హడావిడి పడుతున్నా పట్టించుకోకుండా ఓ అమ్మాయి చిత్ర విచిత్రమైన స్టెప్పులతో జనాలకి అడ్డం పడుతూ హడలెత్తించింది. ఈ వీడియోను కొందరు ‘మీ స్నేహితులతో పంచుకోండి’ అనే కాప్షన్ తో షేర్ చేశారు. ఇక ఈ స్టేషన్ పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌గా తెలుస్తోంది. అంటే ఈ అమ్మడు ఆ ప్రాంతానికి చెందిన స్టేషన్‌లో డ్యాన్స్ హంగామా చేసిందన్నమాట. ఇక ఈ వీడియో వైరల్ అవుతోంది.
Sirisilla : ప్రభుత్వాస్పత్రిలో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన మహిళా సిబ్బంది
ఇలాంటి డ్యాన్స్‌లను తట్టుకోవడం ఎలా అని కొందరు.. కొంచెం ఆమెను ఆపండిని కొందరు.. ఇలా డ్యాన్స్ చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలో అని మరికొందరు ఇలా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వీడియోలకి చాలా మటుకు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోకుండా కొందరు తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లడం విశేషం.
View this post on Instagram