incredible woman : హింసించిన భర్తను విడిచిపెట్టింది.. నువ్వు ఏమీ చేయలేవు అన్న భర్తకు సమాధానం చెప్పింది.. ఆమె ఇప్పుడు 13 బస్సుల ఓనర్

కుటుంబాన్ని కాపాడాల్సిన భర్త కష్టాల్లోకి నెట్టేసాడు. నువ్వు ఏం చేయలేవు.. నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు. అతని మాటలు లెక్కచేయకుండా ఆ మహిళ ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది. తానేంటో నిరూపించింది. ఆ మహిళ సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి.

incredible woman : హింసించిన భర్తను విడిచిపెట్టింది.. నువ్వు ఏమీ చేయలేవు అన్న భర్తకు సమాధానం చెప్పింది.. ఆమె ఇప్పుడు 13 బస్సుల ఓనర్

incredible woman

Updated On : April 29, 2023 / 3:23 PM IST

పెళ్లై పిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఆమెను కష్టాలు పలకరించాయి. భర్త వేధింపులు భరించలేకపోయింది. అతనిని విడిచిపెట్టి ముగ్గురు పిల్లలతో జీవితం మొదలుపెట్టింది. ఇప్పుడామె 13 బస్సులకు యజమాని. నీతా అనే మహిళ కథ ఎంతో స్ఫూర్తి కలిగిస్తోంది.

Bengaluru Woman: బైక్ నుంచి కిందకు దూకేసి.. తెగువ చూపిన బెంగళూరు మహిళ..

గృహ హింస అనేది ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తోంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల పోలీసు ఆఫీసర్‌ని పెళ్లి చేసుకుంది నీతా. మద్యంకి బానిస అయిన భర్త వేధింపులు భరించలేకపోయింది. తన ముగ్గురి పిల్లల్ని తీసుకుని భర్త నుంచి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి ఎన్నోకష్టాలు ఎదుర్కొంది. స్లమ్ ఏరియాలో పిల్లలతో జీవించాల్సి వచ్చింది. ‘నువ్వు ఏమీ చేయలేవు’ అన్న భర్త మాటలను తిప్పి కొట్టాలని నిర్ణయించుకుంది. 34 సంవత్సరాల వయసులో ముగ్గురు పిల్లలతో పాటు తాను చదువుకోవడం మొదలుపెట్టింది. బస్సు, కారు, వ్యాన్లు డ్రైవింగ్ నేర్చుకుంది. అలా స్కూల్‌కి పిల్లల్ని డ్రాప్ చేయడం పనిగా పెట్టుకుంది.

 

ఒక బస్సుతో ప్రారంభమైన ఆమె వ్యాపారం 13 బస్సులతో ‘నీతా ట్రావెల్స్’ ఓనర్‌గా నిలబెట్టింది. ఆమె కూతుళ్లు చదువుకుంటున్నారు. కొడుకుని చదువుకోసం కెనడా పంపించింది. ఇలా జీవితంలో ముందుకు అడుగులు వేస్తోంది. officialhumansofbombay అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేయబడిన నీతా కథ అందరిలో స్ఫూర్తి నింపుతోంది.

Woman’s tip for summer : ఏసీ లేదా? అయినా ఎండ వేడి తట్టుకోవచ్చు.. మహిళ చెబుతున్న టెక్నిక్

బాలీవుడ్ నటి సమీరారెడ్డి అత్తగారు నీతా కథనం చదివి ప్రశంసలు కురిపించడం విశేషం. ‘నీతా ట్రావెల్స్‌లో చాలాసార్లు ప్రయాణం చేశాను.. కానీ ఈ ట్రావెల్స్ వెనుక ఇంత స్ఫూర్తివంతమైన కథ ఉందని తెలియదు’ అని ఒకరు.. ‘ఇన్క్రెడిబుల్ వుమన్ ‘అని మరికొందరు కామెంట్లు పెట్టారు. భర్త అన్న మాటల్ని పట్టుదలగా తీసుకుని తానేంటో నిరూపించిన నీతా మరెందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.