Karnataka : బస్సులో ఈవ్ టీజర్ చెంప పగలగొట్టిన మహిళ

కర్నాటకలో ఓ ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ మహిళ. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించిన గుర్తు తెలియని వ్యక్తి చెంపలు పగలగొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Karnataka : బస్సులో ఈవ్ టీజర్ చెంప పగలగొట్టిన మహిళ

Karnataka

Updated On : June 4, 2023 / 5:22 PM IST

Karnataka : బస్సులో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని చెంపలు పగలగొట్టిన మహిళ వీడియో వైరల్ అవుతోంది. కర్నాటక మంద్యాలో ఘటన వెలుగు చూసింది.

Viral Video: ఈవ్ టీజర్‌కు గుణపాఠం.. యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు.. వీడియో వైరల్

బస్సులో, ట్రైన్లలో ఆడవారిపట్ల ఈవ్ టీజర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. రీసెంట్‌గా కర్నాటకలోని మంద్యాలో ఈవ్ టీజర్ వికృత చేష్టలకు ఓ మహిళ చెంప పగలగొట్టింది. లోకల్ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళను ఓ గుర్తు తెలియని వ్యక్తి వెకిలి చేష్టలతో వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఇబ్బందికి గురిచేస్తున్న ఈవ్ టీజర్‌పై మహిళ తిరగబడింది. కాలర్ పట్టుకుని చెంపలు వాయించింది. ఇంత జరుగుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.

Uttarakhand : ప్రేమ వేధింపులు .. మహిళా న్యాయవాది ముక్కు కొరికేసిన సీనియర్ లాయర్

చివరకు బస్సు నుంచి దిగి పారిపోతున్న ఈవ్ టీజర్‌ను కొందరు యువకులు పట్టుకుందామని ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయాడు. ఇంత జరుగుతూ ఉంటే బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సినిమా చూసినట్లు చూడటం.. మరికొందరు ఈ ఘటనను చిత్రించడంపై జనం మండిపడుతున్నారు.