World Stroke‌ Day : ప్రాణాలు నిలపాలంటే ఆ ‘60 నిమిషాలు’ చాలా ఇంపార్టెంట్

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తే..బాధితుడి ప్రాణాలు నిలపాలంటే మొదటి ‘60 నిమిషాలు’ చాలా ముఖ్యమైనవి నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రోక్ వస్తే ఆస్పత్రి తరలించటంలో క్షణం కూడా లేట్ చేయొద్దు.

World Stroke‌ Day : ప్రాణాలు నిలపాలంటే ఆ ‘60 నిమిషాలు’ చాలా ఇంపార్టెంట్

Braine Stock

Updated On : October 29, 2021 / 2:21 PM IST

World Stroke Day 2021 : అక్టోబర్ 29. ప్రపంచ స్ట్రోక్‌ డే. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. ఇలా మనిషి శరీరంలో స్ట్రోక్స్ అనేవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈక్రమంలో 2021 వరల్డ్ స్ట్రోక్స్ డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో దీనిపై అవగాహన కలిగించనున్నారు. ఈ స్ట్రోక్స్ డే సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏంచేయాలి? అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలుతీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం..

మన పెద్దలు ఆలస్యం అమృతం విషం అని చెబుతుంటారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వారి విషయంలో కూడా అది 100కి నూరు శాతం నిజమని చెబతున్నారు న్యూరాలజిస్టులు. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే మొదటి గంట అంటే 60 నిమిషాల్లో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందేలా చేస్తే ప్రాణాపాయం తప్పినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే కనీసం నాలుగున్నర గంటల్లోపు చికిత్స అందేలా చేస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య సూచిస్తున్నారు. మారుతున్న జీవనశైలిలో భాగంగా స్ట్రోక్స్ అనేవి పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే ఇటువంటి సమస్య వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. 30 ఏళ్లకే స్ట్రోక్స్ బారిన పడుతున్న పరిస్థితి.ముఖ్యంగా ఈకరోనా వచ్చాక స్ట్రోక్స్ సమస్యలు పెరుగుతున్నాయని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని స్ట్రోక్ వచ్చిన తొలి గంటలోపు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందేలా చూడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ రోగులు ఎక్కువగా స్ట్రోక్‌ బారిన పడుతున్నారనీ..తెలిపారు నిపుణులు.

Read more : India : స్ట్రోక్స్ తో ఒక్క ఏడాదిలో 6.99 ల‌క్ష‌ల మంది మృతి : అధ్య‌య‌నంలో వెల్లడి

కరోనా సోకి కోలుకున్న యువకుల్లో కూడా ఈ స్ట్రోక్స్ ఇబ్బందులు పెడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సమస్యలతో పాటు స్ట్రోక్స్ కూడా వెన్నాడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏపీకి చెందిన 30 ఏళ్ల యువకుడు కోవిడ్‌ నుంచి కోలుకున్న 20 రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోవటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.వారి అప్రమత్తతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్ లో చేర్చిన వెంటనే డాక్టర్లు వెంటనే రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్‌ ఇవ్వడంతో స్ట్రోక్‌ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అలాగే మరో 25 ఏళ్ల యువకుడు కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఆ ఫంగస్‌ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడింది. దీంతో అతను బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. కానీ చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించటంలో ఆలస్యం కావటంతో అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో అతను 25 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంతా కాదు.ఇలా కరోనా వచ్చాక ఈ స్ట్రోక్స్ సమస్యలు పెరుగుతున్నాయి. ఇటువంటివి ఎన్నో కేసులు వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. పోస్టు కోవిడ్‌ రోగులు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైయ్యారని డాక్టర్లు చెబుతున్నారు.

స్ట్రోక్‌ వస్తే లక్షణాలు ఇలా ఉంటాయి..
స్ట్రోక్ వస్తే..మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, శరీరం నియంత్రణ కోల్పోవటం వంటి లక్షణాలుంటాయి. దాన్ని వెంటనేగుర్తించి గంటలోపు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. అలాగే వైకల్యం రాకుండా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో చూపు కోల్పోవడం..లేదా ఒకరు ఇద్దరుగా కనిపించటం..చూపులో స్పష్టత లేకుండా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అటువంటిసమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్ తరలించి చికిత్స అందేలాచేయాలి.

Read more: Banana : రోజుకో అరటిపండుతో…గుండె, కిడ్నీ సమస్యలకు చెక్

80 శాతం మందికి క్లాట్స్‌ కారణాలు ఇవే..
మధుమేహం, రక్తపోటు సర్వాసాధారణంగా మారిపోయాయి. అలాగే కొలస్ట్రాల్‌ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటివారిలో రక్తంలో గడ్డ (క్లాట్‌)లు కట్టే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండెకు సంబంధించి వ్యాధులు వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది.

అలాగే ఈ కోవిడ్ కాలంలో పోస్టు కోవిడ్‌ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ రోగులు కూడా స్ట్రోక్‌కు కారణమవుతున్నాయి. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటం..మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లిపోవటం వంటి కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్‌కు గురయ్యే వారు సరైన సమయంలో ఆస్పత్రికి చేర్చితే వారిని కాపాడొచ్చు. వారాకి నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్‌ ఇవ్వడం ద్వారా స్ట్రోక్‌ వల్ల వచ్చే వైకల్యాన్ని అరికట్టవచ్చని చెబుతున్నారు.

Read more:  Blood Pressure : ఈ లక్షణాలుంటే హైబీపీ ఉన్నట్టే…జాగ్రత్తపడండి..

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైతే..ప్రతి క్షణమూ విలువైనదే..
బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషమూ..ప్రతీ క్షణం విలువైనదే. ఒక్క క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించవచ్చు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోవచ్చు. స్ట్రోక్‌ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడొచ్చని..న్యూరాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. సో..అందుకే పెద్దలు ఆలస్యం అమృతం విషం అని చెబుతుంటారు. ప్రాణాలు కాపాడటానికి ప్రతీ క్షణం విలువైనదే.సరైన సమయంలో అప్రమత్తం కావటం వల్ల ప్రాణాలు కాపాడొచ్చు.