Vitamin K : గుండె జబ్బు రోగులతోపాటు, మధుమేహులకు మేలు చేసే విటమిన్ కె !
గుండె జబ్బుల చికిత్సలో అధిక విటమిన్ K తీసుకోవడం ముఖ్యమైనదని పరిశోధనల్లో కనుగొన్నారు. విటమిన్ కె గాయాలు వేగంగా నయం చేస్తుంది.

Along with heart disease patients, vitamin K is good for diabetics!
Vitamin K : విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, గాయం నయం చేయడానికి ,ఎముకల ఆరోగ్యాన్ని అందించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన పోషకం. ఇది విటమిన్ కె ,కె2 లేదా మెనోక్వినోన్ అని పిలిచే రెండు రూపాల్లో ఉంటుంది. విటమిన్ కె అనగానే మనకి రక్తం గడ్డకట్టడమే గుర్తుకువస్తుంది. విటమిన్ K అనేది గడ్డకట్టడం, ఎముకల పెరుగుదల ,గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొవ్వు కరిగే సమ్మేళనాలతో కూడకుని ఉంటుంది. విటమిన్ K లోపం రక్తస్రావం, బలహీనమైన ఎముక పెరుగుదల, బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనల్లో కనుగొన్నారు.
విటమిన్ కెలో ఎక్కువ భాగం ఆహారపదార్థాల నుండి తీసుకోబడాలని సిఫార్సు చేసింది. బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ, కూరగాయల నూనెలు, ఆరికోస్ నెల్లీ, అత్తి పండ్ల వంటి పండ్లు, గుడ్లు, చీజ్, కాలేయం, చిక్‌పీస్, సోయాబీన్స్, గ్రీన్ టీ వంటి వాటి ద్వారా విటమిన్ కె శరీరానికి అందుతుంది. తగినంత విటమిన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. గుండె జబ్బుల చికిత్సలో అధిక విటమిన్ కె తీసుకోవడం ముఖ్యమైనదని పరిశోధనల్లో కనుగొన్నారు. విటమిన్ కె గాయాలు వేగంగా నయం చేస్తుంది. విటమిన్ కె కళ్ళ క్రింద నల్లటి వలయాలు మరియు వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడుతుంది.
విటమిన్ కె లోపం అనీమియా నుండి శిశువులను రక్షిస్తుంది. మరియు వివిధ సమస్యల నుండి రక్షిస్తుంది. విటమిన్ కె కాలేయ క్యాన్సర్ ను నివారించడంలో బాగా సహాయం చేస్తుంది. విటమిన్ కె ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా మెరుగుపరుస్తుంది. మధుమేహం మరియు ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి సహాయకారిగా తోడ్పడుతుంది.
విటమిన్ K లోపం లక్షణాలు:
అధిక రక్తస్రావం, తరచుగా గాయాలు ,గోళ్ల కింద చిన్నగా రక్తం గడ్డకట్టడం శరీర భాగాలలో వరుసలుగా ఉన్న శ్లేష్మ పొరలలో రక్తస్రావం ముదురు నలుపు రంగు మలం, రక్తంతో కూడిన మలం మన శరీరంలో విటమిన్ కె లోపాన్నిసూచిస్తాయి. రోగ్యవంతమైన పురుషులు రోజుకి 120 మి.గ్రాముల విటమిన్ కె తీసుకోవాల్సి ఉండగా, స్త్రీలు రోజుకి 90 మి.గ్రాముల విటమిన్ కె తీసుకోవాల్సి ఉంటుంది.
ఆకుకూరలు, మాంసాహారం, సోయాబీన్స్, పాలపదార్థాల వంటి ఆహారంలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ శరీరంలో తగినంత విటమిన్ కె లోపంతో బాధపడుతుంటే మందుల ద్వారా ఈ విటమిన్‌ను స్వీకరించవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ కె మందులు తీసుకోవాల్సి ఉంటుంది.