Pimples and Moles : పులిపిర్లు, పుట్టుమచ్చలతో జాగ్రత్త! క్యాన్సర్లుగా మారే ఛాన్స్?
గడ్డ లేదా పుట్టుమచ్చ మార్పులకు గురవుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. శరీరంలో వివిధ భాగాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఈ గడ్డలు అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది.

Pimples And Moles Cancer
Pimples and Moles : పుట్టుకతో చాలా మందికి చర్మంపై పుట్టుమచ్చలు వంటివి కనిపిస్తుంటాయి. వయస్సు పెరుగుతున్న దశలో పులిపిర్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వయస్సు 20 తర్వాత శరీరంపై మచ్చలు ఏర్పడి, అవి సరైన ఆకారం లేకుండా, రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే అనుమానించాల్సిన అవసరం ఉంది. పులిపిర్లు కొన్ని సార్లు ఎక్కువ సైజుకు చేరే అవకాశాలు ఉంటాయి. పులిపిర్ల వల్ల ఇబ్బంది లేకపోయినా, పెద్ద సైజులు ఉంటే వాటిని తొలగించుకోవడం మంచిది. లేకుంటే అవి చివరకు స్కిన్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గడ్డ లేదా పుట్టుమచ్చ మార్పులకు గురవుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. శరీరంలో వివిధ భాగాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఈ గడ్డలు అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది. చర్మం అడుగున, రొమ్ములో గడ్డలు వచ్చి అవి కదులుతూ ఉంటే భయపడవలసిన పనిలేదు. చేతితో తాకినప్పుడు గట్టిగా రాయిలా ఉండి, గడ్డ కదలకుండా ఉండి, గడ్డలో మార్పులు కనిపిస్తే మాత్రం క్యాన్సర్ గడ్డగా అనుమానించాలి. ఇలాంటి గడ్డలు నొప్పి లేకుండా ఉంటాయి. ఆ గడ్డల సైజు పెరిగే కొద్ది దాని ప్రభావంతో నొప్పి కలుగుతుంది. సాధారణ చికిత్సకు ఇవి ఏమాత్రం స్పందించవు.
వయస్సు50 ఏళ్లు దాటిన వారిలో నాన్ మెలనోమాస్కన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అల్ట్రా వైలెట్ కిరణాల తాకిడికి గురయ్యే వారిలో ,శరీరాన్ని ట్యాన్ చేయడానికి ఉపయోగించే ట్యాన్ బాత్స్ వల్ల, ,తెల్లగా ఉండే వారిలో, నీలి రంగు కళ్లు కలిగిన వారిలో, పురుషుల్లో ఈ తరహా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండేవారిలో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చర్మం రంగు మారినా, మానిపోయిన పుండు స్కిన్ ప్యాచ్‌లా ఉండిపోయి, రక్తస్రావం జరుగుతున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
చర్మంపై ఏర్పడే పులిపిర్లు, పుట్టుమచ్చలు, గడ్డలు క్యాన్సర్లగా మారిన సందర్భంలో వాటిని చికిత్స ద్వారా నయం చేసేందుకు అవకాశం ఉంటుంది. సర్జరీతో క్యాన్సర్ సోకిన ప్రదేశాన్ని తొలగించటం, లేజర్ చికిత్సతో క్యాన్సర్ కణాలను పూర్తిగా క్షీణింప చేయటం వంటి చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నాశనం చేయవచ్చు. రేడియేషన్, కీమో థెరపీలు అవసరానికి తగ్గుట్గుగా వైద్యులు చికిత్స అందిస్తారు. ఏది ఏమైనా ఇలాంటి వాటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. సమస్య చేయి దాటక ముందే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మేలు.