Salman Khan Disease : ఆ వింత జబ్బుతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్.. తీవ్రమైన నొప్పితో విలవిల.. ఏంటీ ట్రైజెమినల్ న్యూరాల్ గియా..
అప్పుడప్పుడు రావొచ్చు, లేదా తరుచుగా రావొచ్చు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. చావడమే మేలు అనిపించేలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Salman Khan Disease : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ జబ్బు కారణంగా వచ్చే నొప్పితో అతడు విలవిలలాడిపోతున్నాడు. ఆ వ్యాధి తీవ్రమైన ముఖ నొప్పికి కారణం అవుతోంది. దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధి ట్రైజెమినల్ న్యూరాల్ గియాతో సల్మాన్ పోరాటం చేస్తున్నాడు.
2007లో సల్మాన్ కు ఈ జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు 2011లో అతడు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఒక సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు ట్రావిస్ బార్కర్ వంటి ఇతర ప్రముఖులు కూడా ఈ పరిస్థితితో బాధపడుతున్నారు.
సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్ గియాతో బాధపడుతున్నాడు. అదొక న్యూరోలాజికల్ వ్యాధి. సల్మాన్ ఖాన్ ముఖ నొప్పికి కారణం అదే. ఈ దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత త్రిజెమినల్ నాడిని ప్రభావితం చేస్తుంది. ఇది ముఖం నుండి మెదడుకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేయడానికి బాధ్యత వహిస్తుంది.
ఈ నొప్పి ఆకస్మికంగా వస్తుంది. తీవ్రమైన ముఖ నొప్పిగా ఉంటుంది. ఏదైనా నమిలినప్పుడు లేదా మాట్లాడినప్పుడు.. చివరికి చేతితో ముఖాన్ని తాకినప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఉంది. ఇది సాధారణంగా ముఖం ఒక వైపును ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి కొన్ని సెకన్ల నుండి చాలా నిమిషాల వరకు ఉంటుంది. అప్పుడప్పుడు రావొచ్చు, లేదా తరుచుగా రావొచ్చు.
Also Read : పిల్లల ఆరోగ్యమే ముఖ్యం.. ఎనర్జీ డ్రింక్స్ బ్యాన్ చేయాల్సిందే.. ఇక స్కూల్ క్యాంటీన్లలో నాట్ అలోడ్..!
ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. చావడమే మేలు అనిపించేలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే, దాన్ని సూసైడ్ డిసీజ్ అని కూడా అంటారని వివరించారు. ఆ నొప్పి గురించి సల్మాన్ ఖాన్ స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో స్వయంగా చెప్పారు. తన ముఖంపై ఎవరో పిడిగుద్దులు కురిపించినట్లుగా ఉంటుందని అతడు వాపోయాడు.
ఈ జబ్బుకి ప్రధాన కారణాలు.. రక్త నాళాల ద్వారా నరాలు కంప్రెషన్ కావడం, మల్టిపుల్ స్క్లెరోసిస్, కణితులు లేదా ముఖ గాయం. ట్రిజెమినల్ న్యూరల్జియా వ్యాధికి ఒకటే చికిత్స ఉంది. మెదడుకు పంపబడే నొప్పి సంకేతాలను తగ్గించడం లేదా నిరోధించడం. తద్వారా నొప్పి నుంచి రిలీఫ్ కలగుతుంది.
ఈ వ్యాధి బయటపడిన ప్రారంభంలో యాంటీ కన్వల్సెంట్లు, కండరాల సడలింపులు వంటి మందులు ఉంటాయి. ఒక వేళ మందులు పని చేయడం లేదు అంటే.. మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ (MVD), గామా నైఫ్ రేడియో సర్జరీ, రైజోటమీ వంటి సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ 2007లో ‘పార్టనర్’ సినిమా చేస్తున్న సమయంలో ట్రైజెమినల్ న్యూరాల్ గియా లక్షణాలు కనిపించాయి. అప్పటి నుంచి చాలా సంవత్సరాలు అతడు తీవ్రమైన ముఖ నొప్పితో విలవిలలాడు. నొప్పి నుంచి రిలీఫ్ కోసం 2011లో అమెరికాలో సర్జరీ చేయించుకున్నాడు.
ట్రైజెమినల్ న్యూరల్జియాతో బాధపడుతున్న ప్రముఖులు..
ఒక సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు అనేక మంది ప్రముఖులు ఈ బాధాకరమైన పరిస్థితితో బాధపడుతున్నారు. నాలుగుసార్లు బ్రిటిష్ ప్రధాన మంత్రిగా పనిచేసిన విలియం గ్లాడ్‌స్టోన్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు భావిస్తున్నారు. రచయిత్రి మెలిస్సా సేమౌర్‌కు కూడా ఈ జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అమెరికన్ సంగీతకారుడు ట్రావిస్ బార్కర్ కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నాడు.