Dandruff : చుండ్రు రావడానికి కారణాలు ? నివారణకు ఇంటి చిట్కాలు

టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.

Dandruff : చుండ్రు రావడానికి కారణాలు ? నివారణకు ఇంటి చిట్కాలు

What Is Dandruff? Symptoms

Updated On : January 6, 2023 / 12:42 PM IST

Dandruff : జుట్టు సమస్యల్లో తరచూ చిరాకు పెట్టి , ఇబ్బంది కలిగించే సమస్య చుండ్రు. ఇది ఒక రకమైన చర్మవ్యాధి. తల పైన కొత్త కణాలు కంటే మృతకణాలు ఎక్కువయితే అవి పెచ్చులుగా తలపై కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ తోడుఅవుతుంది . జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం రావచ్చును .

చుండ్రు రెండు రకాలుగా ఉంటుంది. తెల్లగా చిన్న చిన్న పొలుసులు పొట్టు రూపం లో రాలుతుంది. దీనిని పొడి చుండ్రుగా చెప్పవచ్చు. చల్లని వాతావరణం లో కనిపిస్తుంది. జిడ్డు చుండ్రు రకం లేత పచ్చ రంగులో ఉండి ఒక్కో సారి చెడువాసన తో కూడి ఉంటుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారిలో ఈ సమస్య ఉంటుంది. చుండ్రు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి సైతం చుండ్రు సమస్యకు కారణమౌతుంది.

ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడిపేవారికి తల మీది చర్మం పొడి బారిపోయి పొట్టులాలేస్తుంది. షాంపూ లతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలకపోయినా ఈ సమస్య వస్తుంది. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగటానికి కారణమౌతుంది. పౌష్ఠికాహారం తీసుకోపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు సమస్య వస్తుంది.

ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. తలస్నానం చేయడానికి అరగంట ముందుగా పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

3. ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

4. టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.

5. వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాయాలి. వేడినీటిలో ముంచిన టవల్ తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.

6. ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు తినాలి. కాయగూరలు, చేపలను సమతూలంగా ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకపోవడం మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.