Christmas 2023 : పిల్లల కోసం క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు ఇవే

క్రిస్మస్ పండుగ అనగానే పిల్లలకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. శాంతా క్లాజ్, చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇవన్నీ వారిలో మరింత సంబరం నింపుతాయి. క్రిస్మస్‌కి పిల్లలకు ఎలాంటి గిప్ట్స్ ఇస్తే బావుంటుంది?

Christmas 2023 : పిల్లల కోసం క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు ఇవే

Christmas 2023

Updated On : December 21, 2023 / 6:51 PM IST

Christmas 2023 : క్రిస్మస్ పండుగ అనగానే పిల్లల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. ఈ పండుగను పెద్దలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శాంతా క్లాజ్ వేష ధారణలో సర్పైజ్ గిప్ట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఎలాంటి గిప్ట్స్ ఇస్తే బావుంటుంది? ఒకసారి చదవండి.

క్రిస్మస్ పండుగ ఆనందంతో పాటు.. ఇతరులకు ఏదైనా ఇవ్వడం అనే సందేశాన్ని చెబుతుంది.  ఈ పండుగ కోసం చిన్నారులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. వారికి ఇష్టమైన చాక్లెట్స్, గిఫ్ట్స్ అందుకోవాలని ఆరాటపడతారు. వారికి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బావుటుంది? అంటే..  DIY క్రాఫ్ట్ కిట్స్ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. వారిలో ఉండే సృజనాత్మకతను వెలికి తీస్తాయి. వారి ఆలోచనలతో ఆభరణాలు, విమానాలు సైన్స్‌కి సంబంధించిన ప్రాజెక్టులతో ప్రయోగాలు చేయడానికి అనువైన కిట్‌లను గిఫ్ట్‌గా ఇవ్వండి.

Playing Games : పిల్లలకు చదువెంతముఖ్యమో.. ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం

చిన్నపిల్లలకు కథలను చెప్పడం.. వారి చేత కథలు చెప్పించడం అలవాటుగా చేయాలి.  స్టోరీ బుక్స్ చదవడం కూడా ప్రోత్సహించాలి. మంచి కథల పుస్తకాలు కొని పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. కథలు చదవడం వల్ల వారిలో ఊహా శక్తి పెరుగుతుంది. కథల చదవడం ద్వారా నీతిని తెలుసుకుంటారు. విజ్ఞానం పెరుగుతుంది. పిల్లలకు సబ్‌స్క్రిప్షన్ బాక్స్‌లు బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలకు ఆసక్తికలిగించేలా నెలవారిగా ఈ బాక్స్‌లు ఉన్నాయి. క్రిస్మస్‌‌కి పిల్లలకు ఇది మంచి బహుమతి.

పిల్లలు చదువుతో పాటు ఎంటర్టైన్‌మెంట్ కోరుకుంటారు. ఇంటరాక్టివ్ గాడ్జెట్స్, కోడింగ్ కిట్స్ లేదా పజిల్స్ వారికి వినోదాన్ని అందిస్తాయి. అంతే కాకుండా క్లిష్టమైన సమస్యను సాల్వ్ చేయడంలో నైపుణ్యాన్ని పెంచుతాయి. తెలియని విషయాలను తెలుసుకోవడంలో ఉండే ఆనందం వారికి తెలుస్తుంది. లైవ్ థియేటర్ షోకి తీసుకెళ్లడం, స్ధానికంగా ఉండే అమ్యూజిక్ మెంట్ పార్కు లేదా సైన్స్ మ్యూజియమ్‌లలో వారికి శాశ్వత సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా వారికి మంచి జ్ఞాపకాలను అందించవచ్చును.

Ghoda Library : పర్వతాలు, మారుమూల గ్రామాల పిల్లల కోసం ‘గుర్రం లైబ్రరి’ ..

పిల్లలకు కుటుంబ బంధాలను ప్రోత్సహించేలా ఇంటి సామాగ్రికి సంబంధించిన కిట్‌లు బహుమతులుగా ఇవ్వచ్చు. బేకింగ్ కిట్, బోర్డ్ గేమ్ సెట్, DIY హోమ్ మూవీ నైట్ కిట్ ఇవి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక పిల్లలు ఎంతగానో ఇష్టపడే తెలుపు, ఎరుపు రంగులో ఉండే శాంతా క్లాజ్ డ్రెస్ కూడా బహుమతిగా ఇవ్వచ్చు. దానిని చూస్తే పిల్లలు తెగ సంబరపడిపోతారు. ఆ డ్రెస్‌లో పిల్లలు క్యూట్‌గా కూడా కనిపిస్తారు. పిల్లలకు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి.. మరింత పండుగ సంబరాన్ని పంచండి.