Ghoda Library : పర్వతాలు, మారుమూల గ్రామాల పిల్లల కోసం ‘గుర్రం లైబ్రరి’ ..

నీళ్లు లేని చోట కూడా మొబైల్ నెట్ వర్క్ ఉంటుందని ఓ సినిమాలో డైలాగ్. భారత్ లో అటువంటి చోట కూడా మొబైల్ నెట్ వర్క్ ఉంటుందేమోగానీ రోడ్డు సౌకర్యాలు మాత్రం ఉండవు. విద్యాసౌకర్యాలు అంతకంటే ఉండవు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. చదువుకు దూరమైన పిల్లల కోసం ఏర్పాటైంది ‘గుర్రం లైబ్రరీ’..

Ghoda Library : పర్వతాలు, మారుమూల గ్రామాల పిల్లల కోసం ‘గుర్రం లైబ్రరి’ ..

horse library in uttarakhand

Ghoda Library In Uttarakhand : మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు అంటారు. అంకిత భావం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఎంతోమంది నిరూపించారు. మారు మూల ప్రాంతాలకు కూడా మొబైల్ నెట్ వర్క్ ఉండే ఈరోజుల్లో విద్యా సౌకర్యాలు మాత్రం ఉండటంలేదు. మారు మూల ప్రాంతాలు, ఎతైన పర్వత ప్రాంతాల వారు మౌలిక సదుపాయాలకు నోచు కోవటంలేదు. ఆ ప్రాంతాల్లో నివసించే పిల్లలకు కనీస వైద్యం,విద్యను అందుకునే సౌకర్యాలు ఉంటంలేదు. కానీ కొంతమంది యువత  వినూత్న ఆలోచనలతో పిల్లలకు విద్యను అందిస్తున్నారు. వారి ఆలోచనలకు రూపమే ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ‘గుర్రం లైబ్రరీ’(Ghoda Library ). పర్వత ప్రాంతాల్లో నివసించే పిల్లల కోసం..రోడ్ల సదుపాయాలు లేని గ్రామాల్లో పిల్లల కోసం ‘ఘోడా లైబ్రరీ’ (Ghoda Library )ని అందుబాటులోకి తెచ్చారు.

ఎంత పెద్ద కొండలపైకి అయినా గుర్రం ఈజీగా ఎక్కేస్తుంది. అందుకే కొండల్ని చురుకుగా ఎక్కేవారిని గుర్రంలా ఎక్కేస్తున్నారని అంటారు. అటువంటి గుర్రాన్ని పిల్లలకు విద్య అందించేందుకు ఉపయోగించారు. హిందీలో ఘోడా అంటే గుర్రం. ఓ గుర్రానికి పుస్తకాలు కట్టి వదిలితే అది కొన్ని గ్రామాల గుండా ప్రయాణిస్తుంది. అలా ఆ పుస్తకాలను ఆయా ప్రాంతాల్లో ఉండే పిల్లలు చదువుకునే అవకాశాన్ని కలిగించింది ‘హిమోత్తహాన్’,సంకల్ప్ యూత్ ఫౌండేషన్ (Sankalp Youth Foundation). నైనిటాల్ జిల్లా(Nainital District)లోని పలు గ్రామాల్లో ఈ ‘ఘోడా లైబ్రరి’ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

నైనిటాల్ జిల్లాలోని చాలా గ్రామాలకు రోడ్ల సదుపాయాలు లేవు. దీనికి తోడు వేసవి సెలవులకు స్కూళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత వర్షాల బీభత్సంతో  స్కూళ్లు తెరుచుకోని పరిస్థితి. వేసవి సెలవులు తరువాత పిల్లలు స్కూళ్లకు వెళ్లే పరిస్థితిలేదు. దీంతో పలు  గ్రామాల పిల్లలు చదువుకు దూరమయ్యారు.  ఇటువంటి పరిస్థితుల్లో ‘హిమోత్తహాన్’,సంకల్ప్ యూత్ ఫౌండేషన్  ఈ గుర్రం  లైబ్రరిని ఏర్పాటు చేసి పుస్తకాలను అందిస్తోంది. కనీస రోడ్డు మార్గాలు,కమ్యూనికేషన్ నెట్‌వర్క్,విద్యా వనరులు లేని మారుమూల గ్రామాలకు ఘోడా లైబ్రరీ చేరుతోంది.

Taliban govt : ఆ పార్కులోకి మహిళలు ప్రవేశించకూడదు, బోటింగ్ చేయకూడదు : తాలిబన్ల మరో హుకుం

గుర్రం లైబ్రరితో దాదాపు 200మంది పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయి. తల్లాజల్నా, మల్లజల్నా, మల్లాబఘని, సల్వా, బఘని, జల్నా, మహల్ధుర, ధిన్వఖారక్, బదంధూర వంటి గ్రామాలు చేరుకోవాలంటే అనేక పర్వతాలు దాటాలి. దారిలో వాగులు వంకలు, సెలయేళ్లను దాటాలి. కేవలం కాలినడకనతోనే వెళ్లాలి. అటువంటి గ్రామాల్లోని పిల్లలకు గుర్రం ద్వారా పలురకాల పుస్తకాలను అందేలా చేస్తున్నారు.

అలా ఈ ఏడాది (2023)600లకు పైగా పుస్తకాలు అందజేశారు. పిల్లల అభిరుచులకు తగిన పుస్తకాలను పంపిస్తారు. జనరల్ నాలెడ్జ్, మోటివేషనల్ స్టోరీలు, నైతిక విద్యకు సంబంధించిన పుస్తకాలను యువకుల బృందం పిల్లలకు అందజేస్తోంది. ప్రభుత్వం నుంచి పాఠశాలల్లో సిలబస్‌ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలను సాహిత్యం,నైతిక విద్యతో అనుసంధానం చేయడానికి ఘోడా లైబ్రరని అందుబాటుతోకి తెచ్చామని చెబుతున్నారు యువత.

Indonesia: పాఠశాలలో మరీ ఇంత వికృత చేష్టలా.. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 14 మంది బాలికలకు గుండు కొట్టారు

ఈ ఘోడా లైబ్రరి గురించి నైనిటాల్ జిల్లాలోని కోటబాగ్‌కు చెందిన అమ్లాకోట్ నివాసి శుభం బధాని మాట్లాడుతూ..తాను హిమోత్తన్ సంస్థకు లైబ్రరీ కోఆర్డినేటర్ గాను, సంకల్ప్ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. జూన్ 10 (2023)భారీ వర్షాల కారణంగా మారుమూల గ్రామాలలో విపత్తు ఎంతో నష్టాన్ని కలిగించింది. పిల్లలకు సాహిత్యం, నైతిక విద్యతో అనుసంధానం చేసేందుకు యువతతో పాటు శుభమ్ ప్రచారాన్ని ప్రారంభించారు. బఘిని గ్రామం నుంచి గుర్రాల గ్రంథాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అలా వారి యత్నానికి బఘిన గ్రామ ప్రజలు సహకరించారు.ఓ గుర్రాన్ని అందించారు. ఆ గుర్రంపై పుస్తకాలు మోసుకుని, బృందంతో కలిసి గ్రామానికి వెళ్లి పిల్లలకు పుస్తకాలు అందించారు.

దీంతో గుర్రం లైబ్రరీ జల్నా, టోక్, అలేఖ్ గ్రామాలకు చేరుకుంది. యువజన సంఘం ఇప్పటి వరకు 600 పుస్తకాలు పంపిణీ చేశారు. నైనిటాల్ జిల్లా విద్యాధికారి (ప్రాథమిక) నాగేంద్ర బర్త్వాల్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సందేశాత్మక పుస్తకాలను అందజేయడానికి యువత చేస్తున్న ప్రచారం మంచిదని ప్రశంసించారు.