Indonesia: పాఠశాలలో మరీ ఇంత వికృత చేష్టలా.. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 14 మంది బాలికలకు గుండు కొట్టారు

ఈ కేసు మషారికి జావాలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలకు సంబంధించినది. గత బుధవారం (ఆగస్టు 23) బాలికలు సరిగ్గా హిజాబ్ ధరించడం లేదని ఒక ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. అనంతరం, ఉపాధ్యాయుల సూచనల మేరకు మొత్తం 14 మంది బాలికలకు గుండు చేశారు

Indonesia: పాఠశాలలో మరీ ఇంత వికృత చేష్టలా.. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 14 మంది బాలికలకు గుండు కొట్టారు

Muslim Girls Hair Shaved: ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ వివాదాలు చూస్తూనే ఉన్నాం. అప్పట్లో కార్ణాటకలోని ఒక పాఠశాలలో పరీక్షల సమయంలో హిజాబ్ ధరించిన వారికి అనుమతి ఇవ్వకపోవడంపై వివాదం తలెత్తింది. ఇది అనతి కాలంలోనే దేశం మొత్తం పాకి దుమారం లేపింది. ఇక ఇరాన్ దేశంలో మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ హిజాబ్ ధరించలేదనే కారణంతో లాపక్ డెత్ అయింది. అనంతరం రేగిన వివాదం ఒక్క ఇరాన్ దేశానికే పరిమితం ప్రపంచం మొత్తం కలకలం సృష్టించింది. ఈ రెండు వివాదాల అనంతరం ఇండోనేషియాలో మరో హిజాబ్ వివాదం లేసింది.

Raksha Bandhan Sale : రక్షా బంధన్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ఆ దేశంలోని ఒక పాఠశాలలో 14 మంది ముస్లిం బాలికలు తప్పుగా హిజాబ్ ధరించారని ఏకంగా పాఠశాల యాజమాన్యమే వారికి శిరోముండనం చేసింది. ఈ ఘటనపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు పాఠశాల యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, పాఠశాలలోని కొంతమంది బాలిక విద్యార్థులు హిజాబ్ తప్పుగా ధరించారు. ఆ తర్వాత పాఠశాల ఉపాధ్యాయుడు బాలికా విద్యార్థులపై చర్య తీసుకోవడంలో భాగంగా వారి గుండు చేయమని ఆదేశించాడట.

2024 Elections: ఇండియా కూటమి మూడో సమావేశానికి ఒకరోజే ఉంది.. అంతలోనే బాంబు పేల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

ఈ కేసు ఇండోనేషియాలోని మషారికి జావాలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలకు సంబంధించినది. గత బుధవారం (ఆగస్టు 23) 14 మంది బాలికలు సరిగ్గా హిజాబ్ ధరించడం లేదని ఒక ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. దీని తర్వాత, ఉపాధ్యాయుల సూచనల మేరకు, మొత్తం 14 మంది బాలికలకు గుండు చేశారు. ఈ వివాదంపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న వివాదంతో పాఠశాల ప్రిన్సిపాల్ ఈ మొత్తం వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం బాలికలతో పాటు వారి తల్లిదండ్రులకు పాఠశాల క్షమాపణలు చెప్పిందని, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

అమ్మాయిల జుట్టు కనిపించింది
జుట్టు కత్తిరించిన బాలికలు హిజాబ్ లోపల ధరించే క్యాప్ ధరించలేదని, దాని వల్ల వారి జుట్టు కనిపిస్తుందని బాలికలకు శిరోముండనం చేసిన చేసిన ఉపాధ్యాయుడు తెలిపాడు. స్థానిక మీడియాతో పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బాలికలు హిజాబ్ ధరించాలని ఎటువంటి నిర్బంధం లేదని, అయితే పాఠశాలలో చక్కగా కనిపించాలంటే, వారు హిజాబ్ కింద ధరించే క్యాప్‌లను ధరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మానసికంగా తోడ్పాటు అందించేందుకు పాఠశాల యాజమాన్యం దోహదపడుతుందన్నారు.

INDIA 3rd Meet: ఎన్డీయేలో మోదీ ఒక్కరే.. అదే ఇండియాలో చాలా మంది ఉన్నారట.. ఉద్దవ్ థాకరే ఉద్దేశం ఏంటంటే?

పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావాలు పడకుండా ఈ వివాదాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని గ్రహించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ ఇండోనేషియా పరిశోధకుడు ఆండ్రియాస్ హర్సోనో ఈ సంఘటన గురించి మాట్లాడుతూ లామోంగాన్ కేసు ఇండోనేషియాలో ఇప్పటివరకు అత్యంత భయానక కేసు అని అన్నారు. విద్యార్థుల వెంట్రుకలను కత్తిరించడానికి ఏ ఉపాధ్యాయుడికి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇది చాలా దురదృష్టకర సంఘటనని అన్నారు. ఇంకా ఇలా చేసిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని, కనీసం స్కూల్ నుంచి అయినా తొలగించాలని ఆండ్రియాన్ అన్నారు.

గతంలో కూడా అనేక హిజాబ్ ఘటనలు జరిగాయి
వాస్తవానికి ఇస్లాం ప్రాబల్యం ఉన్న ఇండోనేషియాలో 2021 సంవత్సరంలో పాఠశాలల్లో కఠినమైన దుస్తుల కోడ్‌ను నిషేధించడం గమనార్హం. అయినప్పటికీ, చాలా ప్రాంతాల్లో అమ్మాయిలు ఈ రకమైన డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా అనుసరించవలసి వస్తోంది. ఇంతకుముందు ఇండోనేషియాలోని పాఠశాలల నుంచి హిజాబ్‌కు సంబంధించిన కేసులు వచ్చాయి. గత సంవత్సరంలో ఇండోనేషియా పాఠశాల ఒక క్రైస్తవ విద్యార్థిని హిజాబ్ ధరించమని ఒత్తిడి చేశారు. దీంతో ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముస్లిం, ముస్లిమేతర బాలికలందరూ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని పాఠశాల నిర్వాహకులు అప్పట్లో వాదించారు.