Milk In House : పొయ్యి మీద పాలు ఏ వైపుకు పొంగితే మంచిదో తెలుసా..?

Milk In House : పొయ్యి మీద పాలు ఏ వైపుకు పొంగితే మంచిదో తెలుసా..?

Milk overflowing In House

Updated On : October 11, 2023 / 5:00 PM IST

Milk overflowing In House : ప్రతీ రోజు పాలు కొంటుంటాం. వాటిని పొయ్యిమీద కాచి మరగబెట్టి పెరుగు తోడు వేస్తాం. ఆ పెరుగులో మీగడ తీసి చల్ల చిలుకితే దాంట్లో వచ్చే వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. ఒక్క పాలలోంచి ఇవన్నీ లభిస్తాయి. అలా పాలు పెరుగు కావాలన్నా..వెన్న మీగడగా మారాలన్నా నెయ్యి తయారు కావాలన్నా పొయ్యి మీద పాలు పెట్టి మరిగించాలి.అలా పాలు పొయ్యిమీద పెట్టి కాచే సమయంలో పొంగిపోతుంటాయి. ‘‘అయ్యో పాలు పొంగిపోయాయే’’ అని తెగ బాధపడిపోతుంటాం. కానీ పాలు అలా పొంగటం ఇంటికి చాలా మంచిదట.

భారతీయ సంప్రదాయంలో పాలు పొంగించటం అనేది ఓ శుభకార్యంగా భావిస్తాం. గృహప్రవేశాలు, కొత్త కాపురాలు పెట్టి కొత్త జంట ఇంటిలో పాలు పొంగింటచం, రథసప్తమి పండుగకు గొబ్బి పిడకల పొయ్యిపై పాలు పొంగించటం, యజ్ఞాలు చేసే సయమంలో పాలు పొంగింటం వంటివి ఎంతో శుభంగా భావిస్తారు. అలా పాలను మూడుసార్లు పొంగిస్తారు. ఈ పాలు పొంగించే ప్రక్రియలో పాలు ఎటువైపుకు పొంగాలి..? అనేది కూడా ముఖ్యమంటున్నారు పండితులు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున పొంగితే శుభ సూచికం అని చెబుతున్నారు పండితులు. పాలు తూర్పు దిక్కుగా పొంగితే అదృష్టమని..సిరి సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అన్నీ శుభాలు సిద్దిస్తాయని సూచిస్తున్నారు.

Horse paintings : గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఉండొచ్చా..? అప్రమత్తంగా లేకుంటే ఆర్థిక కష్టాలే..!

తూర్పు దిక్కు చాలా ఎనర్జీని కలిగించే దిక్కు అంటారు. ఎందుకంటే ఈ సమస్త భూమండల జీవరాశికి సూర్యుడి వల్లే అన్ని లభిస్తాయి. సూర్యుడి గమనం వల్లనే రాత్రి పగలు ఏర్పడతాయి. ఎర్రటి ప్రకాశవంతగా వెలిగిపోయే సూర్యుడే ఈ సమస్త జీవకోటికి ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే భూమి చీకటిమయం అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి చెట్లు, మనుషులు, జీవజాలమంతా నశిస్తుంది. దీంతో భూమ్మీద జీవరాశి అంతమైపోతుంది. అటువంటి శక్తి సూర్యుడికి ఉంది. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే పాజిటివిటీ.

అటువంటి సూర్యుడు తూర్పుదిక్కునే ఉదయిస్తాడు.. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు తద్వారా అదృష్టాన్ని అనుకూలతని పొందేందుకు పాలను తూర్పుదిక్కువగా పొంగితే మంచి జరుగుతుందంటారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని పొంగిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని నమ్ముతారు.

kitchen : అన్నపూర్ణాదేవి నియలమైన వంటింట్లో ఇవి ఉంటే దరిద్రం..

పాలు పొంగితే అయ్యో పాలు పొంగిపోయాయి అంటూ కంగారుపడిపోతాం బాధపడిపోతాం. కానీ పాలు పొంగటం శుభపరిణామాలకి సంకేతంగా భావిస్తారు. అందుకే శుభకార్యాల్లో పాలు పొంగిస్తారు. పాలు సమృద్థికి, సంపదకు సంకేతం, అలాగే శుద్ధికి ప్రతీక పాలు, పవిత్రమైన ఆవు పాలకు హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలు, ఆవునేయ్యి వాడతారు. కాబట్టి పాలు పొరపాటున పాలు పొంగితే అమ్మో పొంగిపోయాయే అని బాధపడకండి..మీ ఇంటిలో శుభ శూచకమని భావించండి అని సూచిస్తున్నారు పండితులు.