ఈ ఒక్క కరోనా వ్యాక్సిన్ చాలు… భవిష్యత్తులో వచ్చే ఎలాంటి వైరస్ నైనా అడ్డుకోవచ్చు

ఈ ఒక్క కరోనా వ్యాక్సిన్ చాలు… భవిష్యత్తులో వచ్చే ఎలాంటి వైరస్ నైనా అడ్డుకోవచ్చు

Updated On : December 31, 2020 / 10:01 AM IST

Covid vaccines protect against future virus strains : భవిష్యత్తులో వందలు వేలల్లో కరోనా వైరస్‌లు ఎన్ని వచ్చినా.. సింగిల్‌గా అడ్డుకోగల ఒకే ఒక వ్యాక్సిన్ తమదే అంటోంది ఆక్స్ ఫర్డ్.. యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్ Sir John Bell తమ వ్యాక్సిన్ పట్ల దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కరోనా మ్యుటేషన్లను సమర్థవంతంగా అడ్డుకోగల సామర్థ్యం Covid-19 వ్యాక్సిన్లకు ఉందని ఆయన అంటున్నారు. యూకేలో విజృంభిస్తోన్న కరోనా కొత్త స్ట్రయిన్‌తో ప్రపంచమంతా వణికిపోతోంది. గతంలో కరోనా వేరియంట్ల కంటే ఈ కొత్త స్ట్రయిన్ చాలా ప్రాణాంతకమని, వేగంగా వ్యాపించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌కు అసలైన పరీక్ష మొదలైందని అన్నారు. యూకే ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి బుధవారం ఆమోదించింది. ఈ నెలలనే ఫైజర్, బయోంటెక్ వ్యాక్సిన్ కు కూడా లైన్ క్లియర్ అయింది.

కొత్త కరోనా స్ట్రయిన్ పై ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలదో లేదో అధికారికంగా తేలాల్సి ఉందని బెల్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి వైరస్ లైనా అడ్డుకోగల దని విశ్వసిస్తున్నట్టు బెల్ స్పష్టం చేశారు. యూకేలో కొత్త వేరియంట్ వ్యాప్తి సమయంలో ఎవరికి వ్యాక్సిన్ అందింది? ఎవరూ వైరస్ బారినపడ్డారో వంటి అంశాలను బట్టి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొత్త స్ట్రయిన్ పై ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందో నిర్ధారించే అవకాశం ఉందంటున్నారు.

గ్రేట్ బ్రిటన్ లో కరోనావైరస్ వేరియంట్ బయటపడగా.. దక్షిణాఫ్రికాలో మొట్టమొదటగా కొత్త స్ట్రయిన్ వెలుగులోకి వచ్చింది. సౌతాఫ్రికాలో కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది కొత్త స్ట్రయిన్ గా రూపుదాల్చిందని బెల్ అభిప్రాయపడ్డారు. ఇదివరకే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లతో కొత్త వైరస్‌ల మ్యుటేషన్లను సైంటిస్టులు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదానిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని బెల్ చెప్పారు. mRNA వ్యాక్సిన్లతో ఇది సాధ్యమే అంటున్నారు బెల్.. ఫైజర్-బయోంటెక్, మోడెర్నా వ్యాక్సిన్లను కూడా మెసేంజర్ RNA టెక్నాలజీతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఇందులోని జనటిక్ మెటేరియల్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చునని తెలిపారు.