Cucumber : దోసకాయను ఈ మూడు పదార్ధాలతో కలిపి తీసుకుంటున్నారా ?

వాస్తవానికి నీరు అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. కండరాలు, నరాలకు శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా కీరదోసకాయ తినడం ఆరోగ్య పరంగా చాలా రకాలుగా మేలు చేస్తుంది.

Cucumber : దోసకాయను ఈ మూడు పదార్ధాలతో కలిపి తీసుకుంటున్నారా ?

Cucumber

Updated On : April 28, 2023 / 6:17 PM IST

Cucumber : వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అదే క్రమంలో అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడుకునేందుకు చాలా మంది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లు , కూరగాయలను తీసుకుంటుంటారు. అలాంటి వాటిలో దోసకాయ చాల కీలకమైనది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి వేసవి అధిక ఉష్ణోగ్రతల నుండి మనకు రక్షణనిస్తుంది.ఈ సీజన్‌లో దోసకాయలను ఎక్కువగా తింటారు.

READ ALSO : Decrease Bloating : కీరదోస, యాపిల్ రసంలో నిమ్మరసం, అల్లం రసం కలిపి తీసుకుంటే?

వాస్తవానికి నీరు అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. కండరాలు, నరాలకు శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా కీరదోసకాయ తినడం ఆరోగ్య పరంగా చాలా రకాలుగా మేలు చేస్తుంది. రోజు మనం దోసకాయ తినడం వల్ల కలిగే కొన్నిప్రయోజనాలపైన మాత్రమే శ్రద్ధ చూపుతాము. నిజానికి, దోసకాయతో కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచి ఫుడ్ కాంబినేషన్ కాదని నిపుణులు సూచిస్తున్నారు.

దోసకాయలతో కలిపి తినకూడనివి ఇవే ;

1. దోసకాయ మరియు టొమాటో కలిపి తింటే ఏమవుతుంది?

దోసకాయ, టొమాటో రెండింటినీ సలాడ్‌లలో కలిపి తింటారు. ఆరోగ్య పరంగా ఇది సరైన ఫుడ్ కాంబినేషన్ కాదట. ఈ రెండు జీర్ణమయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది, కాబట్టి వీటిని కలిపి తినడం మానుకోవాలి. ఈ రెండింటిని కలిపి తింటే, అది శరీరంలోని ఆమ్ల pHని అసమతుల్యత చేస్తుంది. కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

READ ALSO : Cucumber : డయాబెటీస్ ను అదుపులో ఉంచే కీరదోస!

2. దోసకాయ మరియు ముల్లంగి కలిపి తినవచ్చా?

చాలా మంది దోసకాయ, ముల్లంగిని సలాడ్‌లో కలిపి తింటారు. దోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది, ఇది విటమిన్ సిని గ్రహించేలా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు దానితో ముల్లంగిని తింటే, అది ఈ ప్రక్రియలో అడ్డంకిగా మారుతంది. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

3. దోసకాయ మరియు పాలతో చేసిన వాటితో కలిపి తిసుకుంటే ?

చాలా మంది ఆరోగ్యకరమైన పండ్లను సూపర్ హెల్తీ పాలతో కలిపి తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలు ఒక భేదిమందు. ఉదాహరణకు పాలు, పుచ్చకాయలు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ఇబ్బందులు ఏర్పడవచ్చు, దీని ఫలితంగా వాంతులు, విరోచనాలు కలిగే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Potato Juice : చర్మ సంరక్షణకు బంగాళ దుంపల రసం తో !

కాబట్టి దోసకాయను వేసవి కాలంలో తీసుకునే సమయంలో కొన్ని రకాల కాంబినేషన్ల విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. లేకపోతే ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వేసవిలో దోసకాయను రోజువారిగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు.