Gaining Weight : ఈ మూడు సూత్రాలు పాటిస్తే బరువు పెరగటమన్న సమస్యే ఉండదు తెలుసా?
బరువు పెరగకుండా చూడటంలో ఆహారం, జీవనశైలిలో మార్పలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అధునిక పోకడలతో కొత్త ఫుడ్ ట్రెండ్ ల కారణంగా బరువు పెరగటంతోపాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

Gaining Weight :
Gaining Weight : అధిక బరువు అన్నది ఇటీవలి కాలంలో అధిక శాతం మందిలో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి తరువాత చాలా మందిలో దైనందిన దినచర్యతో పాటు తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంటికే పరిమితం కావటంతో శరీరక కదలికలు లేకుండా పోయాయి. కూర్చున్న చోటే ఎక్కవ సమయం గడపటం వల్ల స్ధూలకాయం, అధిక బరువు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం , అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వెతుక్కుంటూ వస్తాయి. అధిక కొవ్వుతో ఇతర సమస్యలు, క్యాన్సర్ రిస్క్, పురుషుల్లో అయితే అంగ స్తంభన సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళల్లో గర్భదారణ సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలు చవిచూడాల్సి వస్తుంది.
అధిక బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మెరుగైన జీవనశైలిని అలవరుచుకోవాలి. కేవలం బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకుండా, దీర్ఘకాలంలో తగ్గిన బరువును తిరిగి పెరగకుండా అదుపులో ఉంచుకోగలిగే ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించటం మంచిది. ఇందుకోసం మూడు కీలక ఆరోగ్య సూత్రాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆహారం, జీవనశైలిలో మార్పులు ;
బరువు పెరగకుండా చూడటంలో ఆహారం, జీవనశైలిలో మార్పలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అధునిక పోకడలతో కొత్త ఫుడ్ ట్రెండ్ ల కారణంగా బరువు పెరగటంతోపాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఆహారపుటలవాట్లను సరిదిద్దుకుని నిపుణుల సూచనలు తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని ఎంచుకోగలిగితే, కొవ్వులను సులభంగా కరిగించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాలి. ఆహారాన్ని మసాలాలు, ఇతర పదార్థాలతో రుచికరంగా తీసుకుంటూ ఆహార నియమాలకు కట్టుబడి ఉండాలి.
రోజువారి వ్యాయామాలు ;
బరువు తగ్గాలన్న ఆలోచనతో చాలా మంది ఒకేసారి అధిక సమయం వ్యాయామాలకే కేటాయిస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. ఎక్కవ సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల గుండె వంటి అవయవాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా కొత్త ఆరోగ్య చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ముందు తేలికపాటి వ్యాయామాలైన నడక, జాగింగ్ వంటి వాటితో మొదలు పెట్టాలి. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. కేవలం క్యాలరీలను కరిగించడమేకాకుండా, శరీరాన్ని ఒత్తిడి నుండి బయటపడేసేందుకు, సులభంగా బరువు తగ్గేందుకు వ్యాయామాలు తోడ్పడతాయి.
కంటి నిండా నిద్ర, శరీరానికి అవసరమైన నీరు ;
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో రాత్రిమొత్తం నిద్రలేకుండా గడుపుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీని వల్ల అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. నిద్రలేమి శరీరంపై దుష్పప్రభావాలను చూపుతుంది. నిద్రకు మనమిచ్చే ప్రాధాన్యం తక్కువైతే అనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కార్టిసాల్ హార్మోన్ సక్రమ పనితీరుకు కంటి నిండా నిద్ర అవసరం. శరీరం తనకు తాను ఆరోగ్య వ్యవస్థల్లోని పొరపాట్లను సరిదిద్దుకుని, ఒత్తిడిని తగ్గించుకునే వెసులుబాటు నిద్రవల్లే సాద్యమౌతుంది. కాబట్టి నిద్రకు కొరత లేకుండా చూసుకోవాలి. పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి తోడ్పడే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. శరీరంలో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండడానికీ, వ్యర్ధాలు బయటకు వెళ్లిపోవటానికి సరిపడా నీరు సేవించాలి. అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉండాలంటే తగిన మోతాదులో నీరు తీసుకోవటం మంచిది.