Eat Eggs : కోడిగుడ్లు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

డిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

Eat Eggs : కోడిగుడ్లు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

eat eggs every day

Updated On : September 2, 2023 / 7:10 PM IST

Eat Eggs : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చంటారు. అదేవిధంగా కోడిగుడ్డు కూడా రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు. రోజులో రెండు కోడిగుడ్లు తప్పనిసరిగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన మేజర్ పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

ఒక కోడిపిల్ల రావడానికి కావాల్సిన అన్ని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. అందుకే కోడిగుడ్లుబలవర్థకమైనఆహారమంటారు.కోడిగుడ్లలో ప్రొటీన్లే కాదు, అనేక రకాల ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందుకే పూర్తి ఆరోగ్యం పొందాలంటే రోజుకి రెండు కోడిగుడ్లు తినమని సూచిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు వెరీగుడ్డు

కోడిగుడ్లసాటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్లు తీసుకున్న వాళ్లు  మిగిలిన రోజులో కేలరీలు తక్కువగా తీసుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు. కోడిగుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. మెదడుకు చురుకుదనం పెంచుతుంది. మనకు కావాల్సిన సెలీనియంలో 44 శాతం ఈ రెండు కోడి గుడ్ల నుంచి పొందవచ్చు.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

గుండెకు బలం

కోడిగుడ్లలో జంతు సంబంధ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో అన్ని రకాల కణజాలాల తయారీకీ ఇది ఉపయోగపడుతుంది. కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. కోడిగుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ని తగ్గిస్తాయి. ట్రై గ్లిజరైడ్స్ కరొనరీ ఆర్టరీడిసీజ్ రిస్కు పెంచే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. కోడిగుడ్లలో ఉంటే డయెటరీ కొలెస్ట్రాల్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ని పెంచుతుంది. తద్వారా గుండెజబ్బులు, స్ట్రోక్ రిస్కు 10 శాతం తగ్గుతుంది.

రక్తం పెరగాలంటే

కణ త్వచాల తయారీకి అవసరమయ్యేఫాస్ఫోలిపిడ్స్ ను తయారు చేసే కోలిన్కోడిగుడ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇది జ్నాపక శక్తికి, కండరాల నియంత్రణను కంట్రోల్ చేసే న్యూరో ట్రాన్స్ మిటర్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది. మనం రోజులో తీసుకోవాల్సిన కోలిన్లో50 శాతం వరకు  ఈ రెండు కోడిగుడ్ల ద్వారా వస్తుంది.

READ ALSO : Prevent Liver Damage : కాలేయం దెబ్బతినకుండా నివారించుకోవాలంటే ఎలాంటి ఆహారాలు ఉపయోగకరమంటే ?

కోడిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది. రెండు కోడిగుడ్ల ద్వారా మనకు 18 శాతం విటమిన్ బి12 అందుతుంది. కోడిగుడ్లలో ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల కోసం కావాల్సిన ఫాస్ఫరస్ ఉంటుంది. రెండు కోడిగుడ్లతో18 శాతం ఫాస్ఫరస్ లభిస్తుంది.

కోడిగుడ్డును ఇలా తింటే బెటర్

ఆమ్లెట్ చేసుకుని తినడం కన్నా ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడమే మేలు. ఆమ్లెట్ గానీ, కూరగా గానీ చేస్తే నూనె రూపంలో ఇతర కొవ్వు యాడ్ అవుతుంది. ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం వర్జిన్ ఆయిల్ గానీ, ఆలివ్ ఆయిల్ గానీ వాడుకోవడం మంచిది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ కి రెసిస్టెంట్ఉంటాయివి. కోడిగుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండితే వాటిలోని పోషకాలు పోయే ప్రమాదం ఉంది.