Tea : టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

బుర్ర హీటెక్కిపోతే ఓ టీ పడాల్సిందే. అటువంటి టీని తాగాలంటే ఫ్రెష్ గా కాచి తాగితేనే మంచిది. అంతేగాని టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదు. అలా తాగితే ఏమవుతుందో తెలుసా..?

Tea : టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

Tea

Updated On : October 18, 2023 / 4:26 PM IST

Tea Tips : పొద్దున్న లేవగానే ఓ కప్పు టీ గొంతులో దిగందే ఏపనిలోను పడరు చాలామంది. గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా సరే ఏదోక టీ గొంతులో దిగాల్సిందే. అసలు టీలో ఉన్నన్ని రకాలు దేంట్లోను ఉండవేమో. వందల రకాలు ఉంటాయి టీలలో.. పనిలో పడాలంటే ఓ కప్పు టీ పడాలి. పనిలో అలసిపోయినా ఓ కప్పు టీ తాగాల్సిందే. అంతేకాదు రిలాక్స్ అవ్వాలంటే ఓ టీ తాగొద్దాంరా అంటారు నేస్తాలు. ఇలా టీ అనేది రోజులో ఓ భాగంగా మారిపోయింది. టీ స్టాల్ దగ్గర కూర్చుంటే దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగే విషయాలన్ని తెలిసిపోతుంటాయి. ఎక్కడలేని ముచ్చట్లు అక్కడే పెట్టుకుంటారు.

బుర్ర హీటెక్కిపోతే ఓ టీ పడాల్సిందే. అటువంటి టీని తాగాలంటే ఫ్రెష్ గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్ టీ టేస్టే వేరు. చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి తాగాలనుకన్నప్పుడు వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్లీ మళ్లీ వేచి చేసుకుని తాగటం మంచిది కాదట..నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Persons Neck : మెడ పొడవును బట్టి వారు ఎలాంటివారో చెప్పొచ్చట..!

కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుందట. బ్యాక్టీరియా వంటి జెర్మ్స్ దాంట్లో డెవలప్ అవుతాయట.య కాబట్టి టీని పదే పదే వేడి చేసి తాగితే అనారోగ్యనికి గురవుతారట.

పాలతో కాచిన టీ 41 నుంచి 140 డిగ్రీల ఫారెన్‌హీట్ మధ్య వేడి చేయబడుతుంది. దీంతో బ్యాక్టీరియా క్రియేట్ అవ్వటమే కాకుండా రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్ మారింది ఏంటో అనుకుంటాం గానీ కారణం మాత్రం ఇదేనట. సో టీని వేడి చేసి తాగటం మంచిది కాదు.

అదే హెర్బల్ టీని అయితే రెండో సారి వేడి చేసి అస్సలు తాగకూడదు. అలా వేడి చేస్తే దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు కిల్ అయిపోతాయి. అంటే నశించిపోతారు. అది తాగినా తాగకపోయినా ఒక్కటే.పైగా గ్రీన్ టీని వేడి చేసి తాగటం అస్సలు మంచిది కాదు.

Pet Dog : కుక్కను పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు అతిసారానికి దాని తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే ఆ ప్రభావం ఆరోగ్యం నెమ్మదిగా పడుతుంది.మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయట.

సో..టీ తాగాలనుకుంటే ఫ్రెష్ గా తయారు చేసుకుని తాగితే మంచిది.రుచికి రుచి ఉంటుంది. తాగిన ఫలితము దక్కుతుంది. పైగా చెడు ప్రభావాలు పడకుండాను ఉంటుంది.